ఘోర ప్రమాదం: వధూవరులతో సహా 12మంది దుర్మరణం
అలీపూర్‌దౌర్: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలీపూర్‌దౌర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో వధూవరులతో సహా 12 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Jalpaiguri (WB): Accident between bus and dumper, 13 killed and 9 injured. pic.twitter.com/L18wOuWqYk
— ANI (@ANI_news) May 1, 2015 అలీపూర్‌దౌర్ జిల్లాలోని 31వ నంబర్ జాతీయ రహదాపై మదారిహత్ అనే గ్రామం వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో వధువరులు సహా 12 మంది అక్కడికక్కడే మరణించినట్లు జిల్లా ఎస్పీ ఆకాశ్ మేఘారియా తెలిపారు.

గురువారం రాత్రి బీర్‌పురాలో వివాహం అనంతరం వరుడి ఇంటికి బయలుదేరిన వాహనంలో మొత్తం 18 మంది ఉన్నారని, తీవ్ర గాయాలపాలైన ఆరుగురిని సమీప ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications