West Bengal: మమతకు ఈసీ మరో షాక్-13 జిల్లాల్లో ఎస్పీలపై..!

పశ్చిమబెంగాల్ (west Bengal)లో ఎన్నికల వేళ ఈసీ వర్సెస్ మమతా బెనర్జీ పోరు ముదురుతోంది. రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నియమించిన అధికారుల్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ కొనసాగించకూడదని పట్టుదలగా కనిపిస్తున్న ఎన్నికల సంఘం.. వారిపై వరుసగా బదిలీ వేట్లు వేస్తోంది. ఇప్పటికే బెంగాల్ సీఎస్, డీజీపీల్ని మార్చడం ద్వారా రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ లపై ఎలాంటి ప్రభావం పడకుండా అడ్డుకున్న ఈసీ.. ఇవాళ మరో సంచలన ఆదేశాలు ఇచ్చింది.

పశ్చిమబెంగాల్లోని 13 జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు వేస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారిని అప్రాధాన్య పోస్టుల్లోకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటన జారీ చేసింది. అలాగే తాము బదిలీ చేసిన ఈ 13 జిల్లాల ఎస్పీల్ని ఎన్నికలతో సంబంధం ఉన్న ఎలాంటి పోస్టుల్లోకి బదిలీ చేయొద్దంటూ ఆంక్షలు కూడా విధించింది. దీంతో మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలినట్లయింది.

West Bengal Anotehr Jolt to Mamata ECI Transfers 13 District SPs Ahead of Assembly Polls

ఇప్పటికే రాష్ట్రంలో సీఎస్, డీజీపీలపై బదిలీ వేటు వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై మమత రగిలిపోతున్నారు. ఈసీ ఎన్నికల నిర్వహణ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమను టార్గెట్ చేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలు మమతకు కచ్చితంగా భారీ షాక్ ఇస్తున్నాయి. మరోవైపు పశ్చిమబెంగాల్లో ఈసారి కూడా మమత హవా తప్పదంటూ ఎన్నికల సర్వేలు తేల్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+