Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా మాస్క్..కమలం గుర్తు.. నరేంద్ర మోడీ పేరు: పంచిపెడుతున్న బీజేపీ కార్యకర్తలు..!

కోల్‌కత: సంక్షోభ పరిస్థితుల్లో అవకాశాలను వెదుక్కుంటూ ఉంటానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. ఆయన అధికారంలో ఉన్న అయిదేళ్లూ ఈ మాటను పలు సందర్భాల్లో ప్రయోగించారు. దాదాపు ప్రతి వేదిక మీదా దీన్ని ప్రస్తావించారు. విభజన తరువాత నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశాలను వెదుక్కోవడమనేది దాని సారంశం.

అదలా వుంచితే- చంద్రబాబు మాజీ మిత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా సంక్షోభంలో అవకాశాలను వెదుక్కునే ప్రయత్నంలోనే ఉన్నట్టనిపిస్తోంది.. ఈ ఉదంతాన్ని బట్టి చూస్తే. చైనాలో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి భారత్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 28కి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీ, తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఓ రకమైన ఆందోళనకర వాతావరణం నెలకొంది.

West Bengal BJP leaders distributing the Coronavirus masks with Party logo and Modi

ఇలాంటి పరిస్థితుల నుంచి రాజకీయంగా అవకాశాలను వెదుక్కుంటున్నట్టు కనిపిస్తోంది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకులు ఉచితంగా మాస్కులను పంచిపెడుతున్నారు. అక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ.. ఆ మాస్కులపై కమలం గుర్తు, మోడీ జీ అనే పేరు ముద్రించి ఉండటం దుమారాన్ని రేపుతోంది. పశ్చిమ బెంగాల్‌లో బలంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌ను ఢీ కొట్టడానికి బీజేపీ నాయకులు కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కోల్‌కత, హౌరా, దక్షిణ 24 పరగణా, దక్షిణ దినాజ్‌పూర్, మేదిని, విష్ణుపూర్, బాంకురా, పురూలియా వంటి చోట్ల విస్తృతంగా ఈ మాస్కులను పంచి పెడుతున్నారు. బీజేపీ గుర్తు, నరేంద్ర మోడీ పేరు ఉన్న మాస్కులను పంపిణీ చేయడం పట్ల అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తప్పు పడుతున్నారు. మాస్కుల పంపిణీలోనూ వివక్షతను చూపుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. తమ రాష్ట్రంలో బీజేపీ బలపడలేదని అంటున్నారు.

Recommended Video

    Coronavirus (COVID-19) : Sales of Masks, Sanitizers Increased Across India | Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+