లైంగిక దాడికి యత్నం: పంచ్‌లతో బెంబేలెత్తించింది
కోల్‌కతా: యువతులు, మహిళలను వేధింపులకు గురిచేస్తున్న ఆకతాయిలకు తగిన బుద్ధి చెప్పింది ఓ యువతి. ఒంటరిగా వెళ్తున్న తనపై దాడికి ప్రయత్నించిన ఇద్దరు దుండగులకు కరాటే పంచ్‌లతో తగిన గుణపాఠం చెప్పింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిందీ సంఘటన.
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతా శివారులోని మధ్యమ్‌గ్రామ్‌కు చెందిన 16 ఏళ్ల యువతి కరాటే క్లాసుల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు తాగుబోతులు ఆమె వెంటపడి వేధించారు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించారు.

దీంతో యువతి తనను తాను రక్షించుకునేందుకు నేర్చుకుంటున్న కరాటే విద్యను ప్రదర్శించింది. వారి ముఖాలపై గట్టిగా పిడిగుద్దులు గుద్దింది. ఒంటిచేత్తో వారిద్దరిని తన కరాటే పంచ్‌లతో పచ్చడి చేసింది. యువతి పంచ్‌లకు తట్టుకోలేక నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
అనంతరం జరిగిన దానిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. స్థానికులైన ఆ ఇద్దరు కామాంధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కరాటే విద్యనే తనకు శ్రీరామ రక్షగా నిలిచిందని ఆ బాలిక ఎంతో ధైర్యంతో చెబుతోంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యాలుగా మారాయని తెలిపింది. వీటి నుంచి తనను తాను రక్షించుకునేందుకే సంవత్సరం నుంచి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నానని తెలిపింది.












Click it and Unblock the Notifications