బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా, సువేందుకు ఛాన్స్ లేదా - మోదీ ఛాయిస్..!!
బీజేపీ కలలు ఫలించాయి. రాజకీయంగా ఢీ అంటే ఢీ అంటున్న మమతను ఓడించాలనే లక్ష్యం నెరవేరింది. హోరా హోరీగా సాగిన బెంగల్ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటి వరకు అందుతున్న ఫలితాల మేరకు మెజార్టీకి కావాల్సిన స్థానాలు దాటి ఆధిక్యతలో కొనసాగుతోంది. టీఎంసీకి ఊహించని పరాభవం కనిపిస్తోంది. తుది ఫలితాల వరకు సీట్ల సంఖ్యలో తేడా ఉన్నా.. బీజేపీకి బెంగాల్ ప్రజలు పట్టం కట్టారని స్పష్టం అవుతోంది. దీంతో.. ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకోనుంది. పార్టీ శాసనసభా పక్ష సమావేశం తరువాత నిర్ణయం అధికారికంగా ప్రకటించనుంది. అయితే, ఇప్పటికే మోదీ- షా ద్వయం ముఖ్యమంత్రి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా సీఎం అభ్యర్ధి ఖరారు ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
బెంగాల్ బీజేపి వశం అయింది. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువు తీరనుంది. తాజాగా అందుతున్న కౌంటింగ్ ట్రెండ్స్ మేరకు బీజేపీ అధికార పగ్గాలు చేపట్టటం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా మూడు సార్లు మమతా పాలన చూసిన బెంగాల్ ప్రజలు ఈ సారి బీజేపీకి పట్టం కట్టారు. ఎన్నికలు రెండేళ్ల ముందుగా బీజేపీ ఇక్కడ పావులు కదపటం ప్రారంభించింది. వ్యూహాత్మకంగా ఒక్కో అడుగు వేసింది. అభ్యర్ధుల ఎంపిక నుంచి మేనిఫెస్టో ప్రకటన... ప్రచార తీరులోనూ కొత్త వ్యూహాలను అమలు చేసింది. మమతను టార్గెట్ చేస్తూ ప్రతీ నిర్ణయం తీసుకుంది. SIR తో సహా బెంగాల్ లో స్థానికంగా ఉన్న సమస్యల పైన ఫోకస్ చేసింది. ప్రతీ సమస్యకు పరిష్కారం దిశగా స్థానికంగా నమ్మకం కల్పించింది. మేనిఫెస్టోలో మహిళలను లక్ష్యంగా చేసుకొని వరాలు ప్రకటించింది. ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేకంగా టీంలను ఏర్పటు చేసి ప్రతీ ఇంటికి పార్టీ నిర్ణయాలు వెళ్లే విధంగా ప్రణాళికలు అమలు చేసింది. బీహార్, త్రిపురలో పార్టీని గెలిపించిన నేతలకు బెంగాల్ బాధ్యతలను అప్పగించింది. ఇక, ఇప్పుడు అనుకున్నది సాధించింది. బెంగాల్ లో తమ పార్టీ నుంచి సీఎంను ఖరారు చేయనుంది. కాగా, బెంగాల్ సీఎంగా గతంలో టీటీఎంసీ నుంచి బీజేపీ లో చేరిన సువేందు అధికారి పేరు ప్రముఖంగా రేసులో వినిపిస్తోంది. అయితే, మోదీ- షా లెక్కలు మాత్రం వేరుగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మమతను ఓడించి సువేందుకు కొత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు కూడా నందిగాం తో పాటుగా భవానీ పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. తొలి రౌండ్లలో భవానీ పూర్ లో వెనుకంజలో నిలిచిన మమతా.. తిరిగి ఆధిక్యత సాధించారు. నందిగ్రాం లో సువేందు లీడ్ లో ఉన్నారు. బీజేపీ ఇప్పటి వరకు 193 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. టీఎంసీ 93 స్థానాలకు పరిమితం అయింది. ఇతరులు మరో 5 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. కాగా.. మమతా ఇంకా గెలుపు పైన నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బీజేపీ తమ సీఎం అభ్యర్ధి విషయంలో దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేసింది.

బెంగాల్ లో బీజేపీ సీఎంగా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా సువేందు అధికారి పేరు ప్రముఖంగా రేసులో ఉంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మమత దూకుడును కంట్రోల్ చేసి ప్రభుత్వం.. పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే సువేందుకే సీఎంగా అవకాశం కల్పిస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే, తాజాగా ముఖ్యమంత్రి రేసులో అయితే, సువేందు తో పాటుగా దిలీప్ ఘోష్, శమిక్ భట్టాచార్య వంటి ఇతర సీనియర్ నాయకుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కానీ సువేందు అధికారి పేరు ముందు వరుసలో ఉంది. భవిష్యత్ వ్యూహాలకు అనుగుణంగా ఇక్కడ సీఎం అభ్యర్ధిని బీజేపీ ఖరారు చేయనుంది. రెండో విడత పోలింగ్ ముగింపు సమయంలో ప్రధాని తిరిగి తాను బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కోల్ కతా వస్తానని చెప్పారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరే అవకాశం కనిపిస్తోంది. కొత్త ముఖ్యమంత్రి విషయంలో ఇప్పుడు బీజేపీ నిర్ణయం ఉత్కంఠ పెంచుతోంది.













Click it and Unblock the Notifications