సిబిఐ విచారణ: గవర్నర్‌గా నారాయణన్ రాజీనామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎకె నారాయణన్ రాజీనామా చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీనామా చేసిన గవర్నర్లలో ఆయన నాలుగవవారు. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ చాపర్ల కొనుగోలు కుంభకోణంలో సిబిఐ ఆయనను శుక్రవారం ప్రశ్నించింది.
80 ఏళ్ల నారాయణన్‌ను సిబిఐ అధికారులు కోల్‌కతాలోని అధికారిక నివాసంలో ఆయనను రెండు గంటల పాటు ప్రశ్నించారు. గత యుపిఎ ప్రభుత్వం నియమించిన 12 మంది గవర్నర్లలో ఇప్పటి వరకు నలుగురు రాజీనామా చేశారు.

యుపిఎ ప్రభుత్వం నియమించిన కొంత మంది గవర్నర్లకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఫోన్ చేసి రాజీనామా చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో నారాయణన్ రాజీనామా చేశారు. నాగాలాండ్ గవర్నర్ అశ్వని కుమార్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ బిఎల్ జోషీ, చత్తీస్‌గఢ్ గవర్నర్ శేఖర్ దత్ ఇప్పటికే రాజీనామా లేఖలు సమర్పించారు.
వివిఐపిల చాపర్ డీల్ కుదిరిన సమయంలో ఎంకె నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పది రాష్ట్రాలకు బిజెపి ప్రముఖులను గవర్నర్లుగా నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications