వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా బెనర్జీ! మీకు చేతకాకుంటే కేంద్రాన్ని అభ్యర్థించు: గవర్నర్ తీవ్రస్థాయి విమర్శలు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా.. మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ సింగ్ ధన్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మమతా నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్కారు భౌతిక దూరం అమలు, మత సమావేశాల నివారణ తదితర అంశాలలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

సీఎం మమతా బెనర్జీకి చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి పారామిలిటరీ దళాలను రప్పించుకోవాలని ఆమెకు గవర్నర్ సూచించారు. కరోనావైరస్‌ను తరిమికొట్టాలంటే లాక్‌డౌన్ నిబంధనలను తూ.చ. తప్పకుండా అమలు చేయాలని స్పష్టం చేశారు.

West Bengal governor slams Mamata Banerjee govt for failing to ensure social distancing.

రాష్ట్రంలో మమతా బెనర్జీ సహా పోలీసులు, అధికారులు భౌతిక దూరం, మతపరమైన సమావేశాలు జరగకుండా చూడటం వంటి అంశాలు 100 శాతం అమలు చేయడం తీవ్రంగా విఫలమయ్యారని గవర్నర్ జగదీప్ సింగ్ ధన్కర్ విమర్శించారు. ఇటువంటి వారికి బయటకు వెళ్లేందుకు ద్వారం చూపించాలని తీవ్రంగా స్పందించారు.

అంతేగాక, కరోనా కట్టడిలో విఫలమైన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని వెళ్లగొట్టాలంటూ గవర్నర్ నేరుగా సీఎంనే లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేయడం తప్పనిసరన్న ఆయన.. ఇందుకు పారామిలిటరీ దళాలను అభ్యర్థించండి అని వరుస ట్వీట్లు చేశారు. కాగా, మొదట్నుంచి గవర్నర్‌కు, మమతా బెనర్జీ విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు విషయాల్లో అటు సీఎం, ఇటు గవర్నర్ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.

English summary
West Bengal governor slams Mamata Banerjee govt for failing to ensure social distancing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X