Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Beggars: అత్యధికంగా బిచ్చగాళ్లు ఉన్న రాష్ట్రంగా నిలిచిన పశ్చిమ బెంగాల్..

మనం సాధారణంగా గుడి వెళ్లినప్పుడు అక్కడ బిచ్చగాళ్లు ఉంటారు. లేదా ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఉంటారు. అయితే బిచ్చగాళ్లు ఎక్కువ ఉన్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. దేశంలోని మొత్తం యాచకుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం గతంలో ఓ ప్రకటన చేసింది. దేశంలో మొత్తం 4 లక్షల మంది బిచ్చగాళ్ల ఉన్నారు. ఇందులో 2 లక్షల మందికి పైగా పురుషులు అదే స్థాయిలో మహిళులు ఉన్నారు.

బిచ్చగాళ్లలో పిల్లలు కూడా ఉండడం దారుణమైన విషయంగా చెప్పుకొవచ్చు. అయితే లెక్కలన్నీ ఏళ్ల క్రితం నాటివి.. ఇప్పుడు బిచ్చగాళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ 81 వేల మందికి పైగా బిచ్చగాళ్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 65 వేలకు పైగా బిచ్చగాళ్లు ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ బిచ్చగాళ్లు ఎక్కువగా ఉన్నారట.

West Bengal has the largest number of beggars in the country

ఆంధ్రప్రదేశ్ లో 30,218, బీహార్ 29,723 మంది, మధ్యప్రదేశ్ 28,695, రాజస్థాన్ 25,853 మంది బిక్షగాళ్లు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. చండీగఢ్‌లో 121 మంది యాచకులు మాత్రమే ఉన్నారు. లక్షద్వీప్‌లో కేవలం ఇద్దరు బిచ్చగాళ్లు మాత్రమే ఉండగా.. దాదర్ నగర్ హవేలీలో 19 మంది, డామన్-డయ్యూలో 22 మంది బిచ్చగాళ్లు ఉన్నారు. అయితే ఈ లెక్కలన్నీ 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ఆధారంగా ప్రకటించారు.

చాలా మంది ఉపాధి లేక బిచ్చగాళ్లుగా మారుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వృద్ధాప్యంలో పిల్లలు ఆదరణ లేకుండా చాలా మంది రోడ్లపైకి వచ్చు అడుకుంటున్నారు. ఇక దేశంలో బెగ్గింగ్ మాఫియా కూడా ఉంది. చాలా మంది అనాథ పిల్లలను బెగ్గింగ్ మాఫియా యాచక వృత్తిలోకి దించుతుందని తెలుస్తోంది.

బెగ్గింగ్ మాఫియా గురించి గతంలో చాలా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. బెగ్గింగ్ తో కోట్లు సంపాదించిన వారు కూడా ఉన్నారు. మహారాష్ట్రలోని ముంబైలో ఓ బిచ్చగాడు కోట్ల రూపాయలు సంపాందించిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. అతని ఇంటిపై ఐటీ రైడ్స్ కూడా జరిగాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+