మాటవినలేదని... కన్న కూతురు నాలుక కోసిన తండ్రి..!

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అతనితో తిరగడం మానివేయాలని తండ్రి మన్సూర్ అలీ లష్కర్ పలుమార్లు హెచ్చరించాడు. అయినా సరే బాలిక వినకపోవడంతో గొంతునులిమి చంపడానికి ప్రయత్నించాడు.
దీంతో బాలిక తప్పించుకోవడంతో తలపై కర్రతో బాది, పదునైన కత్తితో నాలుక కోశాడు. బాలిక నాలుక కోసేందుకు గాను మన్సూర్‌కు ఇద్దరు వ్యక్తులు సహకరించారు. అనంతరం బాలికను సమీపంలోని వ్యవసాయ భూముల్లో పడేశాడు.
శనివారం ఉదయంఅపస్మారక స్ధితిలో పడి ఉన్న బాలికను చూసిన గ్రామస్ధులు డైమండ్ హార్బర్‌కు సమీపంలో ఉన్న సదర్ ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్ధతి సీరియస్‌గా ఉంది.
బాలిక తండ్రి మన్సూర్.. అతనికి సహకరించిన ఇద్దరూ తప్పించుకుపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications