నన్‌పై రేప్: ముంబైలో అనుమానితుడి అరెస్టు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో క్రైస్తవ సన్యాసిని (నన్)పై సామూహిక అత్యాచారం కేసులో సిఐడి అధికారులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడు సలీంను వారు అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మార్చి 13వ తేదీన నన్‌పై దుండుగులు సామూహిక అత్యాచారం జరిపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిసిటీవీ ఫుటేజీలను పరిశీలించిన సిఐడి అధికారులు అనుమానితుల ఫొటోలను విడుదల చేశారు. ఈ ఘటనపై దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించినప్పటికీ అధికారికంగా దర్యాప్తు పనులను చేపట్టాల్సి ఉందని సమాచారం.

West Bengal Nun rape case: Breakthrough for CID; one suspect arrested in Mumbai

నన్‌పై ఏడుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ ఏడుగురిలో సలీం ఒక్కడు. అతన్ని నిఘా సంస్థ సమాచారంతో ముంబైలో సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సలీం దొరికిపోవడంతో మిగతా నిందితుల సమాచారం కూడా లభించవచ్చునని భావిస్తున్నారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ సిబిఐ సిఐడికి సహకరిస్తోంది. కొద్ది రోజుల్లో ఢిల్లీ సిబిఐ దర్యాప్తును తన చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+