జస్టిస్ కర్ణన్ అదృశ్యం.. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? పోలీసులకు చుక్కలు!
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ఆచూకీపై మిస్టరీ నెలకొంది. అరెస్టును తప్పించుకునేందుకు ఆయన చెన్నై నుంచి నెల్లూరు జిల్లా తడకు వచ్చారని ఒకపక్క, లేదు పూజల కోసం శ్రీకాళహస్తికి చేరుకుంటున్నారన
చెన్నై: కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు ఆర్నెల్ల జైలు శిక్ష విధించిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ఆచూకీపై మిస్టరీ నెలకొంది. అరెస్టును తప్పించుకునేందుకు ఆయన చెన్నై నుంచి నెల్లూరు జిల్లా తడకు వచ్చారని ఒకపక్క, పూజల కోసం శ్రీకాళహస్తికి చేరుకుంటున్నారని మరోపక్క బుధవారం వార్తలు వచ్చాయి.
అయితే పోలీసులు ఆ ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. జస్టిస్ కర్ణన్ కోసం గాలిస్తున్న కోల్‌కతా పోలీసులు ఆయన తడ ప్రాంతానికి వచ్చినట్లు జీపీఎస్, డ్రైవర్ ఫోన్ నంబర్ ఆధారంగా గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

జడ్జి కారు సరిహద్దు గ్రామమైన పన్నంగాడు వద్ద ఉన్నట్లు సిగ్నల్ చూపడంతో ఎస్‌ఐ సురేష్ బాబు వెంటనే అక్కడ గాలించారు. కానీ అక్కడ ఎలాంటి ఆచూకీ లభించలేదు. తడలోని సీసీ కెమెరాలను పరిశీలించినా ప్రయోజనం లేకపోయింది. కోల్‌కతా, చెన్నై పోలీసులు, మీడియా ప్రతినిధు లు కూడా తడ పోలీస్ స్టేషన్‌కి చేరుకుని వివరాలు సేకరించారు.
మరోవైపు.. తరచూ శ్రీకాళహస్తికి వచ్చే జస్టిస్ కర్ణన్ బుధవారం చెన్నై నుంచి శ్రీకాళహస్తి దేవస్థానానికి వస్తున్నారని, సాయంత్రం రాహుకేతు పూజ చేస్తారని వార్తలొచ్చాయి. చెన్నైలోని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేసిన కర్ణన్ అధికారికంగా అక్కడి నుంచి ఖాళీ చేయలేదు. ఆయన ఆచూకీ తెలియక పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications