బాయ్‌ఫ్రెండని వెళితే గ్యాంగ్‌రేప్ యత్నం: భవనంపై నుంచి దూకేసింది(వీడియో)

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా సమీపంలోని హౌరాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడే కదా అని వెళ్లిన ఓ యువతి(20)పై సామూహిక అత్యాచారానికి యత్నించారు ఆ దుర్మార్గులు. దీంతో వారి నుంచి తప్పింంచుకోవడానికి మరో మార్గం లేక ఆ యువతి భవనం రెండో అంతస్థు నుంచి కిందకు దూకేసింది.

తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు సమీపంలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి.. యువతిపై అత్యాచారానికి యత్నించిన బాధితురాలి ప్రియుడు, అతడి ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం బాధిత యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి అతడి ఇంటికి వెళ్లింది. అయితే అక్కడ అతడితో పాటు మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారు ఆమెకు మత్తుకలిపిన డ్రింక్‌ ఇచ్చారు.

West Bengal: Woman jumps from second floor to escape rape, 3 arrested

అనంతరం అత్యాచార యత్నానికి ప్రయత్నించగా ఆమె అడ్డుకుని కేకలు వేసింది. దీంతో వారు ఆమెను చంపడానికి ప్రయత్నించగా.. పరిగెత్తుకుంటూ బాల్కని నుంచి కిందకు దూకేసిందని పోలీసులు వెల్లడించారు.

ఆమె దూకడం గమనించిన స్థానికులు.. వెంటనే స్పందించి యువతిని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు యువకులను పట్టుకుని తమకు అప్పగించినట్లు పోలీసుల తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+