girl: అమ్మాయిని పిలుచుకుని వెళ్లి రూమ్ లో ఏం చేశాడంటే ?, స్పాట్ లో పట్టుకున్న తల్లి, కట్ చేస్తే ?
లక్నో/ ఉత్తరప్రదేశ్: మిషన్ శక్తి అభియాన్ కింద పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో ఓ కామాంధుడి ఇల్లు నేలమట్టం అయ్యింది. అన్యంపుణ్యం ఎరుగని తొమ్మిది ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం చేసిన నిందితుడి ఇంటిని పోలీసులు బుల్‌డోజర్‌తో కూల్చివేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలోని కమాసిన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మైనర్ బాలికపై అత్యాచారం జరిగినందున పోలీసులే స్వయంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఫిబ్రవరి 8 వతేదీన బాలికపై అత్యాచారం చేశాడు. నిందితుడిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం అనంతరం నిందితుడు అక్కడున్న వారిని బెదిరించి అదృశ్యమయ్యారు. అనంతరం అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అంతే కాకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు పోలీసులను అభ్యర్థించారు. మహిళా భద్రత కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న మిషన్ శక్తి అభియాన్ కింద మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం 19 ఏళ్ల ప్రదీప్ కుమార్ రాయ్ దాస్ అనే యువకుడు 9 ఏళ్ల బాలికకు చాక్లెట్ ఇస్తానని చెప్పి ఓ రూమ్ లోకి తీసుకెళ్లాడు. అక్కడే అమ్ామయి మీద అత్యాచారం చేశాడు. ఇంతలో బాలిక తల్లి ఆ రూమ్ వద్దకు వెళ్లింది. బాలికపై అత్యాచారం జరగడం చూసి అమ్మాయి తల్లి చాలా గట్టిగా కేకలు వేసింది.
వెంటనే కూతురితో కలిసి ఇంటికి వచ్చి జరిగిన విషయాలన్నీ అడిగింది. అనంతరం బాధితురాలు ఆ విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ తెలియజేసింది. ఇంతకు ముందు కూడా ప్రదీప్ కుమార్ చాలాసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని సమాచారం. పోలీసులు కామాంధుడిని అరెస్టు చేసి బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications