విమానాల్లో బ్లాక్‌బాక్స్ అంటే ఏంటి- ప్రమాదంలో ఏం చేస్తుంది..!!
బ్లాక్ బాక్స్. విమాన ప్రమాదాలు జరిగిన ప్రతీ సందర్భంలోనూ వినే పేరు. ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా.. ముందుగా ఈ బ్లాక్ బాక్స్ పైనే విచారణ అధికారులు ఫోకస్ చేసారు. విమాన నిర్వహణ లో ఎందుకు ఈ బ్లాక్ బాక్స్ ఎందుకింత ప్రాధాన్యత కలిగింది. అసలు ఈ బ్లాక్ బాక్స్ లో ఏముటుంది అనేది అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది. ఫ్లైట్ డేటా రికార్డర్లు (FDR) మరియు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు (CVR) విచారణ లో కీలక పాత్ర పోషిస్తాయి.తాజాగా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనా స్థలిలో నూ ఈ బ్లాక్ బాక్స్ ద్వారా విచారణ జరుగుతోంది.
విమానంలో బ్లాక్ బాక్స్ ది కీలక పాత్ర. విమానం నడపటంలో పైలెట్లు.. ఏటీసీ మధ్య జరిగే కీలక సంభాషణ ఇందులో నిక్షిప్తం అవుతుంది. సాధారణంగా విమాన ప్రమాదం జరిగిన వెంటనే విచారణ సిబ్బంది ఈ బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకుంటారు. బ్లాక్‌బాక్స్‌ను వెలికితీసి డీజీసీఏ లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఏఏఐబీ ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ మెమొరీ డేటా డీకోడ్ చేస్తారు. ఆడియో, డేటాను తీస్తారు. ఇక్కడ లభించే సమాచారం విచారణకు కీలకం కానుంది. ఇక, తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద సమయంలోనూ పైలట్ల నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే సమాచారం మేడే అనే పదం ద్వారా ఏటీసీ కి చెప్పిన్లు తెలుస్తోంది.

ఇప్పుడు సేకరించిన బ్లాక్ బాక్స్ ద్వారా ప్రమాద సమయంలో పైలెట్ల నుంచి మేడే అనే ఒక్క సంకేతమే వచ్చిందా లేక ఇంకేదైనా సంభాషణ జరిగిందా అనే విషయాల పైన దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. బ్లాక్ బాక్స్ ద్వారా అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించి స్పష్టమైన వివరాలను బ్లాక్ బాక్స్ ల ద్వారానే బయట పెట్టరు. ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయిత తర్వాత నుంచి ప్రతి విషయం కూడా ఈ బ్లాక్ బాక్స్‌లో రికార్డు అవుతుంది. ప్రమాదం జరిగి.. మంటలు చెలరేగినా ఈ బ్లాక్ బాక్స్ దృఢంగా ఉంటుంది. రాడర్ సిగ్నల్స్ అందని సమయంలో కూడా బ్లాక్ బాక్స్ పని చేస్తూనే ఉంటుంది. కాక్‌పిట్ పైలట్ నుంచి ఏటీసీతో మాట్లాడిన అన్ని మాటలు రికార్డు చేస్తుంది. అందుకే ప్రమాదం జరిగినప్పుడు దర్యాప్తు అధికారులు దీనినే ఆధారంగా తీసుకుంటారు. ఈ విధంగా విమాన ప్రమాదాల్లో ఈ బ్లాక్ బాక్స్ ఆధారంగానే విచారణలో అసలు విషయాలు బయట పడతాయి.












Click it and Unblock the Notifications