సమాజ్ వాదీ పార్టీలో అధిపత్యం కోసం బాబాయి అబ్బాయిల మద్య పోరు
లక్నో:సమాజ్ వాదీ పార్టీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బాబాయ్, అబ్బాయిలు ఒకరిపై మరోకరు ఎత్తుకు పై ఎత్తు వేసుకొంటున్నారు.మంత్రివర్గం నుండి ఉద్వాసనకు గురైన శివనాల్ యదవ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.గవర్నర్ తో అఖిలేష్ యాదవ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం తెరపడినట్టే పైకి కన్పిస్తోన్నా.....ఆచరణలో మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతోంది.మంత్రివర్గం నుండి ఉద్వాసనకు గురైన శివపాల్ యాదవ్ అధికారిక నివాసాన్ని బుదవారనాడు ఖాళీ చేశారు. ఎస్ పి చీఫ్ ములాయం సింగ్ చెబితేనే తిరిగి మంత్రివర్గంలో చేరుతానని ఆయన స్పష్టం చేశారు.అఖిలేష్ సన్నిహితుడిపై పార్టీ ఆరేళ్ళపాటు సస్పెన్షన్ విధించింది.పార్టీ సస్పెన్షన్ కు గుైన మంత్రిని కూడ తొలగించాలని శివపాల్ డిమాండ్ చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ తో అఖిలేష్ సమావేశమయ్యారు.గవర్నర్ తో సమావేశానికి ముందుగానే అఖిలేష్ తన మద్దతుదారులైన ఎంఏల్ఏలతో తన నివాసంలో సమావేశమయ్యారు.పార్టీలో , కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఎష్ పి చీప్ ములాయం సింగ్ యాదవ్ ప్రకటించిన సమావేశానికే అఖిలేష్ డుమ్మా కొట్టాడు. పార్టీలో నెలొక్ని సంక్షోభం నివురుగప్పిన నిప్పులా ఉందని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడతున్నారు.
సమాజ్ వాదీ పార్టీలో అఖిలేష్, శివపాల్ యాదవ్ గ్రూపుల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అమర్ సింగ్ ను కించపరుస్తూ అఖిలేష్ మద్దతుదారులు కొందరు వేసిన పోస్టర్ కలకలం రేపుతోంది.బాబాయి, అబ్బాయిలు ఒకరిపైమరోకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకొంటున్నారు.అమర్ సింగ్, శివపాల్ ను ములాయం సింగ్ యాదవ్ వదులుకొనే స్థితిలో లేడు. అఖిలేష్ యాదవ్ కూడ తన పంతాన్ని వీడడం లేదు. ఎన్నికల ముందు చోటు చేసుకొంటున్న పరిణామాలు సమాజ్ వాదీ పార్టీని ఇబ్బందికి గురిచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications