కర్ణాటక రిజల్ట్స్: హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి, ప్రభుత్వ ఏర్పాటుకు ఏం చేయాలి?

న్యూఢిల్లీ: కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఎక్కువగా హంగ్ అసెంబ్లీ పేరు ప్రముఖంగా విన్పించింది.అయితే హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి, అసలు హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఏం చేస్తారనే విషయాన్ని తెలుసుకొందాం.

ఏదైనా రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కనీస మెజారిటీని సాధించిన పార్టీలను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఆహ్వానిస్తారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజారిటీ కూడ దక్కని పరిస్థితులు నెలకొన్న సందర్భాలు కూడ లేకపోలేదు.

What is a hung assembly?

అయితే ఆ సమయాల్లో ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై కూడ స్పష్టమైన విధి విధానాలున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో కొన్ని సమయాల్లో వ్యవహరించిన తీరు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులకు కూడ దారితీసింది.

ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజారిటీ ఇవ్వకుండా ఓటర్లు తీర్పు ఇవ్వడమే హంగ్ అసెంబ్లీగా పిలుస్తారు. అంటే ఏ పార్టీ కూడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు అవసరమైన మెజార్టీని కూడగట్టుకొనే పరిస్థితిలో లేకపోవడమే హంగ్ అసెంబ్లీ.

అయితే ఆ సమయంలో ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన (ఆ ఎన్నికల్లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లను గెలుచుకొన్న) పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వనిస్తారు.అయితే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కనీస మెజార్టీని నిర్ణీత గడువులోపుగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.

అయితే ఎక్కువ సీట్లు కైవసం చేసుకొన్న పార్టీ బావసారూప్యత గల పార్టీలు, స్వతంత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దం కావొచ్చు .తమకు కొన్ని పార్టీలు, లేదా స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడ పార్టీలు గవర్నర్ కు ఆయా పార్టీలు లేదా మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంతకాలతో వినతిపత్రాలు సమర్పిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడ ఆహ్వనిస్తారు.

అయితే ఏ పార్టీ కూడ మరో పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం కాకపోతే మరోసారి ప్రజల తీర్పు కోసం వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. లేదా కొంతకాలం పాటు రాష్ట్రపతి పాలనకు కూడ అవకాశం లేకపోలేదు అయితే ఈ సందర్భం అతి అరుదుగా సంభవిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+