'కల్మా' అంటే ఏమిటి, ఉగ్రవాదులు దాని గురించే ఎందుకు అడిగారు..?
ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన ఆ 26 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు. వారి ఆనందపు కేరింతలు కాస్తా ఆర్తనాదాలుగా మారి, ఆ లోయంతా విషాద ఛాయలు అలముకున్నాయి. పహల్గామ్‌లో జరిగిన భయానక ఉగ్రదాడిలో దాదాపు 26 మంది మరణించారు.ఇందులో నేపాల్‌కు చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. ఈ దుర్ఘటన కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కాదు, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవ్వడం అందర్ని కలిచి వేస్తోంది.
ఆనందం కోసం వచ్చిన వారి కలలు క్షణాల్లో చెదిరిపోయాయి. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి, భవిష్యత్తు అంధకారంలోకి నెట్టింది.కాల్పులు జరుపుతున్న సమయంతో హిందువా , ముస్లింవా అని అడిగి మరీ చంపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హిందువులను నిర్ధాక్షంగా చంపేయాగా, ముస్లింను మాత్రం కల్మా గురించి అడిగారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కల్మాను పూర్తిగా చదివన వారిని మాత్రం ఉగ్రవాదులు వదిలిపెట్టడం జరిగింది. కల్మా అంటే ఏమిటి, ఉగ్రవాదులు ఆ సమయంలో ఎందుకు దాని గురించి అడిగారని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అసలు కల్మా అంటే ఏమిటో తెలుసుకుందాం. కల్మా అంటే ఇస్లాంలో విశ్వాస ప్రకటన. ఇది కొన్ని ప్రత్యేకమైన పదాల సముదాయం, దీని ద్వారా ఒక వ్యక్తి తన ఇస్లాం మతాన్ని ప్రకటిస్తాడు. కల్మాను పఠించడం అనేది ఇస్లాం యొక్క ప్రాథమిక సూత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సాధారణంగా, ఆరు కల్మాలు ప్రచారంలో ఉన్నాయి, ముఖ్యంగా దక్షిణ ఆసియాలోని ముస్లింలలో వీటి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. అయితే, ఖురాన్‌లో లేదా హదీసుల్లో ఈ ఆరు కల్మాలు ఒకే చోట పేర్కొనబడలేదు. ఇవి వేర్వేరు హదీసుల నుండి సేకరించబడ్డాయి. ఈ ఆరు కల్మాలు ఏమిటో చూద్దాం.
1.కల్మా తయ్యిబ్
2.కల్మా షహాదత్
3.కల్మా తమ్‌జీద్
4.కల్మా తౌహీద్
5.కల్మా అస్తగ్‌ఫార్
6.కల్మా రద్దే కుఫర్
ఈ ఆరు కల్మాలు ఇస్లాం యొక్క ప్రాథమిక విశ్వాసాలను మరియు సూత్రాలను తెలియజేస్తాయి. వీటిని పఠించడం మరియు వాటి అర్థాలను తెలుసుకోవడం ప్రతి ముస్లింకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.












Click it and Unblock the Notifications