అసలు ప్రొటెం స్పీకర్ అంటే ఎవరు?: ఆ నియామకానికి అనుసరించే పద్దతులేమిటి?
బెంగళూరు: కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా కేజీ బోపయ్యను అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా నియమించడంతో.. ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేజీ బోపయ్య నియామకం సరైందేనా? కాదా? అన్నది పక్కనపెడితే.. అసలు ప్రొటెం స్పీకర్ పాత్ర ఏమిటి?, ఆయన నియామకంలో అనుసరించే పద్దతులేమిటి అన్న దానిపై చాలామంది ఆరా తీస్తున్నారు.

ప్రొటెం స్పీకర్ నియామకం:
లోక్‌సభ ప్రొటెం స్పీకర్ పద్దతిలోనే శాసనసభ ప్రొటెం స్పీకరును నియమిస్తారు. సాధారణంగా సీనియర్ సభ్యుడినే ఎందుకు ఎంపిక చేస్తారు. అయితే అందరికన్నా సీనియర్ అయిన సభ్యుడినే ఎంపిక చేయాలన్న నిబంధనేమి లేదు. ప్రొటెం స్పీకర్ కోసం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మొదట కొందరు సీనియర్ సభ్యుల జాబితా రూపొందిస్తోంది. ఆ తర్వాత గవర్నర్ ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేస్తారు. లోక్ సభలో అయితే ఈ బాధ్యత రాష్ట్రపతి తీసుకుంటారు.
ప్రొటెం స్పీకర్ విధులు:
సాధారణంగా అయితే ఎన్నికలు జరిగిన వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడం, స్పీకర్ ఎన్నిక జరిగే వరకూ సభను నిర్వహించడం వీరి ప్రధాన విధి. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ రాజీనామా చేయడం, లేదా మరణించడం జరిగిన సందర్భాల్లోనూ ప్రొటెం స్పీకరును నియమిస్తారు. స్పీకరును ఎన్నుకునే స్థితిలో సభ లేనప్పుడు.. ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నది లేనిది తేల్చే బలపరీక్షను ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications