ఎటిఎంలలో నగదు ఎందుకు ఉండడం లేదో తెలుసా ?
పెద్ద నగదునోట్లు రద్దు చేసిన తర్వాత బ్యాంకుల నుండి ఎటిఎంలలో నగదును డిపాజిట్ చేసే ఏజెన్సీలకు ఆశించిన రీతిలో నగదు అందని కారణంగా ఎటిఎంలు సక్రమంగా పనిచేయడం లేదు. తమ ఖాతాదారుల అవసరాలకు డబ్బు సరిపోవడంలేదు
ముంబై :పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, ఎటిఎం ల వద్ద కొత్త కరెన్సీ కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. దేశంలోని యాభై శాతానికి పైగా ఎటిఎంలు పనిచేయడం లేదు. ఎటిఎంలలో నగదును డిపాజిట్ చేయాల్సిన ఏజెన్సీలకు అరకొరగా డబ్బులు అందజేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. తమ వద్ద ఎక్కువ మొత్తంలో నగదు లేని కారణంగానే ఎటిఎంలకు నగదును డిపాజిట్ చేయలేకపోతున్నట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కొత్త కరెన్సీ కోసం బ్యాంకులు, ఎటిఎం ల వద్ద ప్రజలు బారులు తీరడం కన్పిస్తూనే ఉంది. దేశంలోని యాభై శాతానికి పగా ఎటిఎంలు పనిచేయని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులకు ఎటిఎంలకు సరిపోను నగదును అందించకపోవడమే కారణంగా అధికారులు చెబుతున్నారు.
కొన్ని ఎటిఎంలలో నగదును డిపాజిట్ చేసినా కొద్దిసేపట్లోనే నగదు అంతా అయిపోయి ఎటిఎంలో పనిచేయని పరిస్థితి కన్పిస్తోంది.అయితే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా తాము డబ్బులను పంపుతున్నట్టు ఆర్ బి ఐ అధికారులు ప్రకటిస్తోన్నా ప్రజల అవసరాలను మాత్రం తీర్చలేకపోతున్నాయి.
రిజర్వ్ బ్యాంకు నుండి వస్తోన్న నగదును బ్యాంకులు తమ ఖాతాదారుల అవసరాల కోసం బ్యాంకులోనే ఉంచుకొంటున్నాయి. ఈ కారణంగానే బ్యాంకుల నుండి ఎటిఎంలకు అందజేయాల్సిన నగదును సక్రమంగా సరఫరా చేయలేకపోతున్నారని కొందరు అధికారులు చెబుతున్నారు.
ఈ కారణంగానే ఎటిఎంల్లో నగదును నింపే ఏజెన్సీలకు పూర్తి స్థాయిలో నగదు అందడంలేదు. దరిమిలా ఎటిఎంలు ఖాళీగా కన్పిస్తున్నాయి.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications