మహిళలపై రేప్‌లు: నోరు పారేసుకున్న ఆర్ఎస్ఎస్ నేత

మహిళలపై అత్యాచారాలకు, అక్రమ సంతానానికి, ఇతర సమస్యలకు వాలెంటైన్స్ డే కారణమని ఆర్ఎస్ఎస్ నేత అంటున్నారు.

జైపూర్: మహిళలపై అత్యాచారాలకు, అక్రమ సంతానానికి, స్త్రీలపై హింసకు పాశ్చాత్య సంప్రదాయమైన వాలంటైన్స్ డే కారణమని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. శిక్షణా కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులను ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు.

ప్రేమ భారతదేశంలో పవిత్రత, భక్తిభావం భారతదేశంలో పెంచుతుందని, కానీ వాటిని పాశ్చాత్య ప్రపంచం వ్యాపారమయం చేసిందని, ఆ కారణంగానే వాలెంటైన్స్ డే ఉత్సవానికి పురుడు పోసిందని ఆయన అన్నారు. భారతదేశంలో ప్రేమ పవిత్రమైంది, భక్తిపూరితమైందని ఆయన అన్నారు.

What is the reason for rape? Valentine's day, says RSS leader

రాధాకృష్ణ, లైలా మజ్ను, హీర్ రంజా వంటి కథలను అది గానం చేస్తుందని, అయితే ప్రేమ దాన్ని వ్యాపరమయం చేసిందని, వాలెంటైన్స్ డేను ప్రారంభించిందని, అదే అత్యాచారాలకు, అక్రమ సంతానానికి, మహిళలపై హింసకు కారణమని అన్నారు.

భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా ఆ సమస్యను ఎదుర్కుంటోందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఆత్మను పరిశుద్ధం చేస్తుందని, వ్యక్తిత్వాన్ని పెంచుతుందని, మానవత్వాన్నీ నైతిక విలుపలనూ పెంపొందిస్తుందని చెప్పారు. ప్రజల ఆత్మలను పరిశుద్ధం చేయాల్సిన అవసరం ఉందని, దానివల్ల దేశమూ సమాజమూ ప్రగతి సాధిస్తుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+