'ఇండియా తొలి ప్రధాని ఎవరంటే' మోడీ ఫోటో చూపించిన గూగుల్, నటి రమ్య చురకలు
న్యూఢిల్లీ: గూగుల్ ఇండియా సెర్చ్ బార్ జవహర్ లాల్ నెహ్రూను నరేంద్ర మోడీగా మార్చింది! భారత తొలి ప్రధాని అని వెతికితే ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కనిపించింది. దీంతో నెటిజన్లు సెటైర్లు వేశారు. భారత తొలి ప్రధాని గురించి వెతికితే వికీపీడియా లింక్‌ను చూపిస్తున్న గూగుల్ సెర్చ్ బార్ పక్కనే మోడీ ఫోటోను చూపించింది.
ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారతదేశపు మొదటి ప్రధాని అని వెతికితే చేస్తే నెహ్రూ సమాచారంతో పాటు ప్రస్తుత ప్రధాని మోడీ ఫొటో దర్శనం ఇవ్వడంతో పలువురు నెటినజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొరపాటును గుర్తించిన గూగుల్ దానిని సరిచేసింది. అలాగే భారత దేశ మొదటి ఆర్థిక మంత్రి అని టైప్ చేస్తే ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫొటో, మొదటి రక్షణ మంత్రి అని టైప్ చేస్తే ఇప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోలు వచ్చాయి.
నెహ్రూ సమాచారం పక్కన మోడీ ఫొటో కనిపించిన స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గూగుల్ తప్పిదంపై చాలామంది విమర్శలు చేశారు.
కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ దివ్య స్పందన దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గూగుల్ ఇండియా! ఏ అల్గారిథం ఇలా చూపిస్తోంది? మీ వద్ద చాలా జంక్ ఉంది' అని ట్వీట్ చేశారు.
-
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications