నిన్న జియాఖాన్‌తో లవ్: నేడు పాక్ నటితో డేటింగ్?
ముంబై: బాలీవుడ్ నటి జియా ఖాన్‌తో ప్రేమాయణం సాగించి తర్వాత ఆమె ఆత్మహత్య కేసుతో సతమతమవుతున్న నటుడు సూరజ్ పంచోలీ ఈ మధ్య మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అతను ఇప్పుడు పాకిస్థానీ నటి మావ్రా హోకేన్ (సనమ్ తేరీ కసమ్ ఫేం)తో కలిసి చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకు చిక్కాడు. వీరిద్దరు కూడా ఓ పార్టీలో కలుసుకున్నారు. అప్పటినుంచి తరచు జంటగానే కనబడుతున్నారు.

ఈ విషయమై మీడియా సూరజ్ పంచోలీని ప్రశ్నించింది. మీ మధ్య ఏం ఉందని మీడియా ప్రశ్నించింది. దీంతో సూరజ్ మీడియాపై ఒంటికాలిపై లేచాడు. 'ఇదే ప్రశ్న మావ్రా నాకు మంచి స్నేహితురాలు. ఇద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అంతకు మించేం లేదు' అన్నాడు.












Click it and Unblock the Notifications