హార్దిక్ పటేల్ ప్రియురాలి కోసం పోలీసుల ఆరా!

న్యూఢిల్లీ: పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్‌ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా, సూరత్‌లోని లాజ్‌పూర్ జైలులో ఉన్న హార్దిక్‌ను పోలీసులు ఉద్యమానికి సంబంధం లేని ప్రశ్నలు వేస్తూ అసహనానికి గురి చేస్తున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. న్యాయవాది యశ్వంత్ వాలా తెలిపిన వివరాల ప్రకారం.. హార్దిక్‌ను డిసెంబర్ 10న సూరత్ డీసీబీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జేహెచ్ దహియా అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి..

ప్రశ్న: మీ ప్రియురాలి పేరేమిటి?
హార్దిక్ : నాకు ప్రియురాలే లేదు.

ప్రశ్న: మహార్యాలీ తర్వాత అహ్మదాబాద్‌లో లాఠీఛార్జికి ఎవరు ఆదేశించారనుకుంటున్నారు? హార్దిక్: అమిత్ షా ఆదేశాలిచ్చి ఉంటారు.

ప్రశ్న: మీరు రూ.84 కోట్ల ఆస్తులు కూడబెట్టారని, అమ్మాయిలతో అబు, ఢిల్లీ, మసౌరీ తదితర ప్రాంతాలకు వెళ్లి, పార్టీలు చేసుకున్నట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ చెప్తోంది?
హార్దిక్: లేదు. ఒకటిన్నర సంవత్సరాల క్రితం నేను మసౌరీలో ఉండేవాడిని. నాదగ్గర రూ.84 కోట్లు ఉండి ఉంటే ప్రతి నెలా ఆందోళన చేసేవాడిని, 25 లక్షల మందిని కూడగట్టగలిగేవాడిని.

What's your girlfriend's name? Gujarat Police ask Hardik Patel

ప్రశ్న: ఎంత మొత్తంలో విరాళాలు స్వీకరించారు?
హార్దిక్: నాకు గుర్తు లేదు.

ప్రశ్న: మీరు చాలా మంది అమ్మాయిలతో మాట్లాడినట్లు మీ ఫోన్‌ను ట్యాప్ చేసినప్పుడు తెలిసింది.
హార్దిక్: మా కులం అక్కచెల్లెళ్లు, తల్లులతో నేను మాట్లాడాను.

ప్రశ్న: భగత్ సింగ్ మార్గంలో నడవాలని మీరు ప్రకటించారు. అంటే మీ ఉద్దేశం ఏమిటి?
హార్దిక్: అవసరమైతే ఆందోళన చేస్తాం. వీధుల్లో ర్యాలీ చేస్తాం.

ప్రశ్న: పాటిదర్లు మీకు మద్దతు ఇస్తారని అనుకుంటున్నారా? విడుదలైన తర్వాత ఉద్యమాన్ని కొనసాగిస్తారా?
హార్దిక్: అహింసాయుతంగా నా పోరాటాన్ని కొనసాగిస్తా.

ప్రశ్న: ఆందోళన వల్ల రాష్టంలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?
హార్దిక్: 8 నుంచి 9 మంది పాటిదర్ యువతను పోలీసులు చంపారు. దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు?

ప్రశ్న: మిమ్మల్ని ఇరికించినట్లు మీరు భావించడం లేదా?
హార్దిక్: మీ పోలీసులే ఇరికించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+