ఇంట్రెస్టింగ్ : తీహార్ జైలులో చిదంబరం రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి..?

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు సెప్టెంబర్ 19వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను తీహార్ జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలివ్వడం జరిగింది. అయితే తీహారు జైలుకు చేరుకున్నాక చిదంబరం ఎలాంటి ప్రక్రియను ఎదుర్కొంటారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇక సాధారణ వ్యక్తిలానే ఆయన్ను చూడటం జరుగుతుందని తీహార్ జైలు సూపరింటెండెంట్ చెప్పారు.

చిదంబరం తీహారు జైలుకు చేరుకున్న తర్వాత అక్కడి జైలు అధికారులు ముందుగా కోర్టు ఇచ్చిన ఆర్డరు కాపీని పరిశీలిస్తారు. జడ్జిచే ఆమోద ముద్ర వేయబడ్డ అన్ని దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆతర్వాత చిదంబరంకు గుర్తింపు పరీక్షలు అధికారులు నిర్వహిస్తారు. ఆ తర్వాత చిదంబరంను మెడికల్ పరీక్షకు తరలిస్తారు. అయితే సాధారణ ఖైదీలానే చిదంబరంను పరిగణిస్తామని జైలులోని విశ్వసనీయ వర్గాల సమాచారం

ఇక తీహార్ ‌జైలులో చిదంబరం రోజువారీ కార్యక్రమాలు ఇలా ఉంటాయి

What will Chidambarams daily routine be in Tihar Jail

జైలులో ఉండగా అందరిలానే చిదంబరం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య నిద్రలేవాల్సి ఉంటుంది. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత టిఫిన్ చేస్తారు. టిఫఇన్ కింది దాలియా/బ్రెడ్ ఇస్తారు. టీ బిస్కెట్లు కూడా చిదంబరంకు ఇస్తారు. ఇక టిఫెన్ చేసిన తర్వాత చిదంబరం వాకింగ్ చేసే అవకాశం ఇస్తారు. చిదంబరం ఇంకా విచారణ పరిధిలోనే ఉన్నందున ఆయన తనకు కేటాయించిన సెల్‌కే పరిమితం అవుతారు. ఇక భోజనం మధ్యాహ్నం ఒంటిగంటలకు ఇవ్వడం జరుగుతుంది. భోజనంలో భాగంగా చిదంబరంకు రోటీ, పప్పు, సబ్జీ ఇస్తారు.

ఇక చిదంబరంకు కొన్ని పరిమితుల కింద టీవీ చూసే అవకాశం కల్పిస్తారు. అంతేకాదు ఆయన లైబ్రరీ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇక కోర్టు అనుమతి ఇస్తే చిదంబరం కుటుంబ సభ్యులు ఆయన్ను కలిసే అవకాశం ఉంటుంది. ఇక రాత్రి భోజనం ఏడు గంటల నుంచి 8 గంటల మధ్య ఇవ్వడం జరుగుతుంది. ఇక రాత్రి 9 గంటల సమయంకల్లా జైలులో ఉన్న ఖైదీలందరినీ వారికి కేటాయించిన సెల్‌లో ఉండేలా అధికారులు చూస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+