వాట్సాప్ షాక్: 17.5 లక్షల అకౌంట్లు బ్యాన్.. రూల్స్ బ్రేక్ అట..
వాట్సాప్.. సోషల్ మేసెజింగ్ యాప్, దీనికి క్రేజ్ ఎక్కువ.. వయసుతో సంబంధం లేకుండా అందరూ యూజ్ చేస్తున్నారు. వాట్సాప్ లేనిది పూట గడవదు. అవును వాట్సాప్ మేసేజ్, స్టేటస్ చూసి టైమ్ పాస్ చేస్తారు. అయితే కొందరు యూజర్లు మాత్రం వాట్సాప్ లేనిది ఊపించుకోలేరు. రూల్స్ బ్రేక్ చేసిన చాలా మంది యూజర్లపై చర్యలు తీసుకుంది.
ఐటీ రూల్స్ 2021ను ఉల్లంఘించిన అకౌంట్లను నవంబరులో బ్యాన్ చేశామపి వాట్సాప్ ప్రకటన చేసింది. మొత్తం 17 లక్షల 59 వేల అకౌంట్లను తొలగించడంతో పాటు 602 గ్రీవెన్స్ రిపోర్టులు సబ్‌మిట్ చేశారు.ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. యూజర్ సేఫ్టీ ఆధారంగా నవంబరు నెలలో ఆరో నెల రిపోర్టు కూడా సబ్‌మిట్ చేశాం. ఇందులో వాట్సప్ నుంచి యాక్షన్ తీసుకోమంటూ వచ్చిన కంప్లైంట్లు ఉంటాయి. ఇదే ప్లాట్ ఫాం మీద దుర్భాషలాడిన వ్యక్తులపై తగిన యాక్షన్ తీసుకోవాలని ఉన్నదని కంపెనీ ప్రకటనలో తెలిపింది. ఆ మేరకు చర్యలు తీసుకున్నామని పేర్కొంది.

అసభ్యపదజాలం వాడే కామెంట్లను ఫిల్టర్ చేయడంలో వాట్సప్ ఇండస్ట్రీలోనే లీడర్‌గా మారింది. సంవత్సరాలుగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ, డేటా సైంటిస్ట్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్‌ను పెట్టుబడిగా ఉంచి యూజర్ల సేఫ్టీని పర్యవేక్షిస్తుంది. అక్టోబరులో 20 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేసిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం.. అనధికారికంగా, బల్క్ మెసేజ్‌లుగా చేసే 95 శాతం స్పామ్ మెసేజ్‌లకు చెక్ పెట్టింది.
నిబంధనలు పాటించలేదని అకౌంట్లపై నిషేధం విధించింది. మిగతా వారు కూడా అలర్ట్ అవుతారు. వాస్తవానికి వాట్సాప్.. ఇతర మేసేజింగ్ యాప్ వాడే సమయంలో టర్మ్స్ అండ్ కండీషన్స్ ఉంటాయి. అందులో అన్నింటికీ యూజర్ అగ్రి చేశాకే అకౌంట్ అక్టివేట్ అవుతుంది. కానీ దానిని ఆ సమయంలో ఎవరూ చదవరు. రూల్స్ బ్రేక్ చేయడంతో.. కంపెనీ నియమాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. ఇలా ఇంతమంది అకౌంట్లను బ్యాన్ చేసి షాక్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications