రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు: ప్రధాని మోడీ పిలుపుపై వాట్సాప్ మెసేజ్ వైరల్..ఏంటంటే?

న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశప్రజల్లో భరోసా నింపేందుకు అదే సమయంలో వారిలో ధైర్యం నింపేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ అప్పుడప్పుడు టీవీల ద్వారా దేశప్రజలకు పలు జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు. అంతేకాదు దేశమంతా ఈ కష్ట సమయాల్లో ఒక్కతాటిపైకి వచ్చి మహమ్మారిపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. భారత్‌ను ముప్పతిప్పలు పెడుతున్న ఈ కరోనావైరస్‌ను జయించాలంటే సామాజిక దూరం పాటించడం, ఇళ్లకే పరిమితం కావడం వంటివి మాత్రమే చికిత్స అని చెబుతూ వచ్చారు ప్రధాని మోడీ.

తాజాగా ప్రధాని మోడీ శుక్రవారం రోజు దేశప్రజలకు మరో పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5 ఆదివారం రోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లల్లో లైట్లు ఆఫ్ చేసి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. తద్వారా కరోనావైరస్‌తో అంధకారంలోకి వెళ్లిపోయిన భారత్‌ ఒంటరి కాలేదని దీనిపై పోరాడి తిరిగి వెలుగులోకి తీసుకొస్తామనే సంకల్పం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పారు. తాజాగా మోడీ పిలుపుపై సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

WhatsAPP message goes viral on PM Modis call to light lamps at 9 PM for 9minutes

మోడీ అలా పిలుపు ఇచ్చారో లేదో ప్రముఖ ఇన్స్‌టాంట్ చాటింగ్ యాప్ వాట్సాప్‌లో ఓ మెసేజ్ వైరల్‌గా మారింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఒక వీడియోను పోస్టు చేస్తానని ప్రధాని మోడీ చెప్పారు. ఇప్పుడు 9వ సంఖ్యపైనే సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. 9 నవగ్రహాలను శాంతిపజేసేలా చర్యలు తీసుకుంటే భూమిపై ప్రాణాలు నిలబడుతాయని అందుకే 9 అనే అంకెను ప్రధాని మోడీ ఎంచుకున్నారనే మెసేజ్ వైరల్ అవుతోంది. నవగ్రహ ఆరాధన ద్వారా మహమ్మారి నుంచి విముక్తి పొందుతామనేది ఈ మెసేజ్ సారాంశంగా కనిపిస్తోంది.

మెసేజ్ ఇలా ఉంది:

ప్రధాని సంఖ్యాశాస్త్రం
1. ఉదయం 9: గంటలకు వచ్చారు

2. 9 నిమిషాల పాటు ప్రసంగించారు

3. తేదీ 5 ఏప్రిల్ అంటే 5+4= 9

4. రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు

5.ఈ రోజుతో లాక్‌డౌన్‌కు 9 రోజులు

6. 5వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌కు 9 రోజులు మిగిలి ఉంటాయి

Recommended Video

    PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM

    5 ఏప్రిల్ (5+4) =9

    రాత్రి 9 గంటలు, 9 నిమిషాలు , 9వ గ్రహం అంగారకుడు

    వెలుగు, అగ్ని = అంగారకుడు

    అంటే అంగారక గ్రహంను మోడీ యాక్టివేట్ చేస్తున్నారు.
    అంతేకాదు 5+4=9, రాత్రి 9 గంటలు, 9 నిమిషాలు

    9ని 3తో గుణిస్తే వచ్చే సంఖ్య 27 అంటే 2+7=9

    ఇక నవగ్రహ ఆరాధన అంటే తొమ్మిది గ్రహాలకు పూజ చేస్తే ప్రాణాలు దక్కుతాయి. అందుకే ప్రధాని మోడీ 9ని ఎంచుకున్నారంటూ చెబుతూ వాట్సాప్‌లో మెసేజ్ వైరల్ అవుతోంది.

    WhatsAPP message goes viral on PM Modis call to light lamps at 9 PM for 9minutes
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+