WhatsApp:ఈ ఫోన్ వినియోగదారులకు ఇబ్బందే..ఎందుకో తెలుసుకోండి..!

వాట్సాప్... ఇది లేకుండా ఈ రోజు ప్రపంచం ముందుకు వెళ్లడం లేదు. ఈ అద్భుతమైన ఫీచర్‌లేని స్మార్ట్ ఫోన్ లేదు. స్మార్ట్ ఫోన్ స్విచాన్ చేయగానే కాల్స్ కంటే ముందుగా వాట్సాప్‌నే ఓపెన్ చేసి చూస్తాం. ఇక ఒకప్పుడు వాట్సాప్‌లో పలు భద్రతా అంశాల లోపం కనిపించింది. కానీ అన్నిటినీ సవరించుకుని ఎప్పటికప్పుడు ఫీచర్స్‌ను అప్‌డేట్ చేస్తూ వచ్చింది. ఒకప్పుడు ఏదైనా ఇబ్బందికర మెసేజ్ పొరపాటున మిత్రుడికి పోస్టు చేస్తే దాన్ని డిలీట్ చేసే అవకాశం ఉండేది కాదు. ఆ తర్వాత డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఫీచర్‌ రావడంతో చాలా మంది యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు.

 డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్

డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్

డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌తో మీడియా ఫైల్ కానీ, టెక్ట్స్‌కానీ ఇతరులకు పంపిన తర్వాత కూడా డిలీట్ చేసే అవకాశం ఉంది. దీంతో కొందరు ఇబ్బందికర పోస్టులు పొరపాటున పెట్టి ఆ తర్వాత గ్రహిస్తే వెంటనే వాటిని పంపించిన వారి వాట్సాప్‌లో కూడా డిలీట్ చేసే వెసులుబాటు కల్పించింది. అయితే ఈ తరహా ఆప్షన్ ఆండ్రాయిడ్ వర్షన్‌లో పనిచేస్తుంది కానీ... ఐఫోన్ వినియోగిస్తున్న వారి ఫోనులో మాత్రం ఇది పనిచేయడం లేదు. డిలీట్ చేసినప్పటికీ కూడా ఐఫోన్‌ వినియోగిస్తున్న వారి ఫోన్లలో ఆ మీడియా ఫైల్ కానీ టెక్ట్స్‌ ఫైల్ కానీ ఇంకా కనిపిస్తోంది.

 ఐఫోన్‌లో పనిచేయని డిలీట్ ఫర్ ఎవ్రీవన్

ఐఫోన్‌లో పనిచేయని డిలీట్ ఫర్ ఎవ్రీవన్


దీన్నే కొందరు సాంకేతిక నిపుణులు టెస్ట్ చేస్తున్నారు. ముందుగా ఒక ఫోన్ నుంచి ఐఫోన్‌కు ఒక మీడియా ఫైల్ పంపి ఆ తర్వాత డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ వినియోగించి డిలీట్ చేస్తే అది చాట్ స్పేస్‌లో డిలీట్ అవుతుంది కానీ ఐఫోన్‌లోని కెమెరా రోల్‌లో మాత్రం అలానే ఉంటోంది. ఇక వాట్సాప్ డీఫాల్ట్ సెట్టింగ్స్‌ను ఐఫోన్ యూజర్ వినియోగిస్తున్నట్లయితే ఒక మీడియా ఫైల్ తన ఫోనుకు వచ్చిన వెంటనే అది ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్ అవుతోంది. డౌన్‌లోడ్ అయ్యిందన్న విషయం యూజర్‌కు కూడా తెలియకపోవడం విశేషం. ఒక్క సారి ఐఫోన్‌కు వీడియో కానీ ఫోటోలు కానీ వచ్చాయంటే యాపిల్ సంస్థ వాటిని కెమెరా రోల్ నుంచి డిలీట్ చేసే సౌలభ్యం కల్పించలేదు. కేవలం చాట్ విండోలో మాత్రమే డిలీట్ అవుతుంది.

 మీడియా ఫైల్స్ డిలీట్ అవుతాయని గ్యారెంటీ లేదు

మీడియా ఫైల్స్ డిలీట్ అవుతాయని గ్యారెంటీ లేదు


ఈ బగ్‌ను కనుగొని దీనిపై సీరియస్‌గా రియాక్ట్ అవడంతో వాట్సాప్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐఫోన్‌కు చేరిన ఫలానా మీడియా ఫైల్ శాశ్వతంగా డిలీట్ అవుతుందన్న గ్యారెంటీ లేదని చెప్పింది. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌ కేవలం టెక్ట్స్ మెసేజ్‌లనే డిలీట్ చేస్తుందని మీడియా ఫైళ్లను కాదని స్పష్టం చేసింది. అయితే ఇది ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే అని ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నవారికి మాత్రం డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్‌ను వినియోగిస్తే టెక్ట్స్ మెసేజ్‌లతో పాటు మీడియా ఫైల్స్ కూడా శాశ్వతంగా డిలీట్ అవుతాయని స్పష్టం చేసింది. ఇక ఐఫోన్ యూజర్ తనకు వచ్చిన మీడియా ఫైల్స్‌ను కెమెరాకు స్టోర్ చేసేలా ఆప్షన్‌ పెట్టుకుంటే వాట్సాప్‌ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌ కిందకు రాదని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+