Whatsapp: రేపట్నుంచి ఈ 49 స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు

హైదరాబాద్: వాట్సాప్ యూజర్లకు ముఖ్య గమనిక. రేపట్నుంచి అంటే జనవరి 1, 2023 నుంచి పలు స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. సాంకేతికంగా తమకు అనుకూలంగా లేని ఫోన్లలో వాట్సాప్ సేవలను సేవలను నిలిపివేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ నిర్ణయం రేపట్నుంచి అమల్లోకి రానుంది.

జనవరి 1 నుంచి 49 స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు

జనవరి 1 నుంచి 49 స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్, భద్రతాపరమైన లోపాల వల్ల 49 స్మార్ట్ ఫోన్ మోడల్స్‌లో వాట్సాప్ సపోర్ట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. యూజర్లు ఈ మార్పును గమనించాలని కోరింది. జనవరి 1 నుంచి వాట్సాప్ కొత్తగా విడుదల చేసే ఫీచర్, సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇకపై ఆయా ఫోన్లకు రావని స్పష్టం చేసింది.

వాట్సాప్ పనిచేయనది ఈ స్మార్ట్ ఫోన్లలోనే

వాట్సాప్ పనిచేయనది ఈ స్మార్ట్ ఫోన్లలోనే

వాట్సాప్ పేర్కొన్న ఈ 49 మోడల్ ఫోన్లలో ఎక్కువగా పాత వెర్షన్ మొబైల్సే ఉన్నాయి. ఈ జాబితాలో ఐఫోన్ 5, 5సీతోపాటు శాంసంగ్ గెలాక్సీ సీరిస్‌లో కోర్, ఎస్2, ఎస్3 మినీ, ట్రెండ్ 2, ట్రెండ్ లైట్, గెలాక్సీ్ ఎక్స్ కవర్ 2,
ఆర్కోస్ 53 ప్లాటినం, గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్ జేటీఈ, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987 జేటీఈ,
హువాయి: అసెండ్ డీ, అసెండ్ డీ1, అసెండ్ డీ2, అసెండ్ జీ740, అసెండ్ మేట్, అసెండ్ పీ1హెచ్‌టీసీ డిజైర్ 500,
ఎల్‌జీ: ఎల్జీ ఎనాక్ట్, లూసిడ్ 2, ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డీ, ఆప్టిమస్ ఎప్3, ఆప్టిమస్ ఎఫ్3క్యూ, ఆప్టిమస్ ఎఫ్5, ఆప్టిమస్ ఎఫ్6, ఆప్టిమస్ ఎఫ్7, ఆప్టిమస్ ఎల్2 II, ఆప్టిమస్ ఎల్3 II, ఆప్టిమస్ ఎల్3 II డ్యూయల్, ఆప్టిమస్ L4 II, ఆప్టిమస్ L4 II డ్యూయల్, ఆప్టిమస్ L5, ఆప్టిమస్ ఎల్ 5 డ్యూయల్, ఆప్టిమస్ ఎల్ 5 II, ఆప్టిమస్ ఎల్ 7, ఆప్టిమస్ ఎల్ 7 II, ఆప్టిమస్ ఎల్ 7 II డ్యూయల్, ఆప్టిమస్ నిట్రో హెచ్‌డీ, లెనోవో ఏ820, మెమో జేటీఈ వీ956
క్వాడ్ ఎక్స్‌ఎల్, సోనీ: ఎక్స్‌పీరియా ఆర్క్ ఎస్, ఎక్స్‌పీరియా మిరో, ఎక్స్‌పీరియా నియో ఎల్, వికో సింక్ ఫైవ్
వికో డార్క్‌నైట్ జేటీ..మొబైల్ ఫోన్లు ఉన్నాయి.

త్వరలో వాట్సాప్ స్టేటస్ రిపోర్ట్ ఫీచర్

త్వరలో వాట్సాప్ స్టేటస్ రిపోర్ట్ ఫీచర్

యూజర్లకు మెరుగైన సేవలు అందించడం కోసం ఎప్పటికప్పుడు యాప్‌ను అప్‌డేట్ చేస్తున్న వాట్సాప్.. మరో ఫీచర్ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్ రిపోర్ట్ అనే ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు ఇతరుల స్టేటస్ పై ఏవైనా అభ్యంతరాలున్నా.. అనుమానాస్పదంగా ఉన్నా.. వాట్సాప్ కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+