వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రి సచిన్‌పై బ్యాడ్ కామెంట్: పంచ్ ఇచ్చిన అర్జున్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన తండ్రిపై చెడు వ్యాఖ్య చేసిన ఓ మిత్రుడుకి సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పంచ్ ఇచ్చాడు. 2007 ఐసిసి ప్రపంచ్ కప్ పోటీల నుంచి తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టినందుకు భారత జట్టుపై అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. సచిన్ టెండూల్కర్ డకౌట్ కావడం వల్లనే భారత్ ఓడిపోయిందని అర్జున్ టెండూల్కర్ మిత్రుడు ఒకతను అన్నాడు.

భారత జట్టు ఓటమిపై ఏ విధమైన ప్రతిస్పందన చూపించవద్దని తల్లి అంజలి చెప్పినప్పటికీ అర్జున్ టెండూల్కర్ మౌనంగా ఉండలేకపోయాడు. గ్రూప్ బిలో శ్రీలంకపై ఓటమి పాలై ప్రపంచ కప్ నుంచి వైదొలిగింది. టెండూల్కర్ పరుగులేమీ చేయకుండానే దిల్హహరా ఫెర్నాండో బౌలింగులో అవుటయ్యాడు. 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భార్త 69 పరుగులకే చేతులెత్తేసింది. ఈ సంఘటన గురించి టెండూల్కర్ తన ప్లేయింగ్ ఇట్ మై వేలో రాశాడు.

When Arjun Tendulkar punched a friend for talking bad about his dad

2007 కరేబియన్ ప్రపంచ కప్ నుంచి తొలి రౌండులోనే వైదొలిగిన తర్వాత మరో సంఘటన కూడా చోటు చేసుకుందని టెండూల్కర్ రాశాడు. తాము దారుణంగా ఆడామని ఆయన చెప్పాడు. తొలి రౌండులోని తాము వెదొలగాల్సి రావడం వల్ల ఎదుర్కోవాల్సిన పరిణామాల గురించి తన కుటుంబ సభ్యులకు తెలుసునని, అవి పిల్లలను కూడా తాకుతాయని, ఎవరో పాఠశాలలో చెడుగా వ్యాఖ్య చేస్తే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేకుండనని, అది నిరాశ పరిచిందని చెప్పాల్సి ఉండిందని, భవిష్యత్తులో బాగా ఆడుతారని అని ఉండాల్సిందని సచిన్ టెండూల్కర్ వివరించాడు.

తమ సలహాలు వృధా అయ్యాయని, తనపై చెడు కామెంట్ చేసిన మిత్రుడికి అర్జున్ పంచ్ ఇచ్చాడని, తన తండ్రి గురించి మరోసారి చెడుగా మాట్లాడవద్దని హెచ్చరించాడని సచిన్ టెండూల్కర్ వివరించాడు.

English summary
Arjun, son of Sachin Tendulkar, was so angry with one of his friends for making a comment on his dad that he "punched" him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X