సినిమాకెళ్లిన కేజ్రీకి మోడీ నినాదాలతో షాక్ (వీడియో)
ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఆదివారం నాడు ఊహించని షాక్ తగిలింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన 'ఎయిర్ లిఫ్ట్' సినిమాకు వెళ్లిన కేజ్రీవాల్‌కు వింత అనుభవం ఎదురైంది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని వైశాలి సెక్టార్ పరిధిలో ఉన్న అన్సల్ ప్లాజాకు వెళ్లారు. అక్కడ ఎయిర్ లిఫ్ట్ సినిమాను చూసి, ఆనందించారు. తనను ఎవరూ గుర్తించకముందే కేజ్రీవాల్ లోపలకు వెళ్లారు.
అయితే, సినిమా పూర్తయ్యాక బయటకు వచ్చేటపుడు మాత్రం అతను జనం కంటబడ్డారు. కేజ్రీని చూసిన వెంటనే అక్కడి వారంతా ‘మోడీ.. మోడీ' అంటూ నినాదాలు చేశారు. దీంతో కేజ్రీవాల్ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం మొదటి షో చూశారు.












Click it and Unblock the Notifications