వామ్మో: రోడ్డుపైనే డజన్ సింహాల హాల్ చల్, ఎక్కడి ట్రాఫిక్ అక్కడే
న్యూఢిల్లీ: మనం ప్రయాణీస్తోంటే ఆకస్మాత్తుగా సింహం వస్తే ఏం చేస్తాం. భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తాం. సింహానికి చిక్కకుండా ఆమడదూరం వెళ్ళిపోతాం.అయితే ఏకంగా 12 సింహాలు రోడ్డుపై వస్తే ఆ రోడ్డుపై ప్రయాణం చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. గుజరాత్ లోని ఓ హైవేపై ఇదే ఘటన చోటు చేసుకొంది.
పిపవాన్-రాజుల హైవేను దాటి మరో వైపు వెళ్ళేందుకు అటవీ ప్రాంతం నుండి 12 సింహాలు గుంపుగా రోడ్డుపైకి వచ్చాయి. వీటిని చూడగానే వాహనదారులు భయపడ్డారు.మరికొందరు యువకులు ధైర్యం చేసి మొబైలు ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఉత్సాహం చూపారు.
శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ సంఘటనను ఓ డ్రైవర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హైవే పై ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో సింహాలు రోడ్డు దాటేందుకు కొంత సమయం పట్టింది.

సింహాలు మొదట హైవేపైకి రాగానే ఓ వైపు లైన్ లో వస్తున్న వాహానాలను నిలిపివేశారు.అయితే హైవేపై డివైడర్ ఎత్తుగా ఉండడంతో అటుపక్క లైన్ లో వస్తున్న వారికి సింహాలు కనపడలేదు.
సింహాలు నెమ్మదిగా డివైడర్ ఎక్కి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాయి. అటువైపు వస్తున్నవారు వాహనాలను ఆపి అవి వెళ్ళేందుకు దారి ఇచ్చారు. హైవేపై సుమారు 15 నిమిషాల పాటు ట్రాఫిక్ ఆగిపోయింది.
సింహాలన్నీ రోడ్డు దాటిన తర్వాతే ట్రాఫిక్ క్లియరైంది. కాగా, ఓ సింహాం రోడ్డు దాటలేక వెనక్కు వెళ్ళిపోయింది.గతంలో ఈ ప్రాంతంలో రోడ్డు, రైల్వే లైన్ దాటుతూ చాలా సింహాలు ప్రమాదాల్లో మరణించాయి.












Click it and Unblock the Notifications