ధోవతీ ఎలా విప్పాలో నేను రష్యా మహిళకు నేర్పిస్తా: హోంమంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ మరోసారి వార్తలకు ఎక్కారు. ఈసారి తప్పుడు వ్యాఖ్యల కారణంగా వార్తల్లోకి ఎక్కారు. ఆయనగారు ఆదివారంనాడు రాష్ట్ర స్థాయి పార్టీ సదస్సులో ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆయనగారి మాటలు విని అందరూ విస్తుపోయారు. తాను రష్యా నాయకుడి భార్యకు ధోవతిని ఎలా విప్పాలో నేర్పిస్తానని చెప్పినట్లు తెలిపారు.
ఆయన వ్యాఖ్యలకు చాలా మంది ఇబ్బంది పడ్డారు. వారిలో చాలా మంది మహిళలు ఉన్నారు బిజెపి రాష్ట్ర చీఫ్ నందకుమార్ కూడా సదస్సులో అన్నారు. ధోవతీని ఎలా కట్టుకోవాలని రష్యా నాయకుడి భార్య ఆసక్తి కనబరిచిందని ఆయన చెప్పారు.

దాన్ని ఎలా ధరించాలనే విషయాన్ని తాను చెప్పను గానీ ఎలా విప్పాలో నేర్పిస్తానని, కానీ ఇప్పుడు కాదు, తర్వాత అని తాను చెప్పినట్లు బాబూలాల్ గౌర్ అన్నట్లు స్థానిక మీడియా రాసింది. ఓ రష్యా మహిళ తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్న విషయాన్ని కూడా 84 ఏళ్ల గౌర్ చాలా ఆసక్తిగా చెప్పారు.












Click it and Unblock the Notifications