తప్పుకో: జూకర్‌బర్గ్‌ను చేయిపట్టి లాగిన మోడీ(వీడియో)
న్యూఢిల్లీ: భారత్ ప్రధాని నరేంద్రమోడీ కెమెరాను ఎంతగానో ప్రేమిస్తారనడానికి ఇదొక చక్కటి ఉదాహారణ. సిలికాన్ వ్యాలీలోని ఫేస్‌బుక్ హెడ్ క్వార్టర్స్‌ను ప్రధాని నరేంద్రమోడీ సందర్శించిన సమయంలో సీఈఓ మార్క్ జూకెర్స్‌బర్గ్‌ను చేయిపట్టి పక్కకు లాగిన వీడియో సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో హాల్ చల్ చేస్తోంది.
ప్రధాని మోడీకి పబ్లిసిటీ అంటే చాలా ఇష్టమంటూ నెటిజన్లు సైతం సెటైర్లు వేస్తున్నారు. 15 నిమిషాలు నిడివి కలిగిన ఈ వీడియో సిలికాన్ వ్యాలీలోని టౌన్ హాలులో చోటు చేసిన సంఘటనకు సంబంధించినది. సెప్టెంబర్ 27న ప్రధాని సిలికాన్ వ్యాలీలోని టౌన్ హాలులో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకెర్స్‌బర్గ్‌తో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ చిట్‌చాట్‌కు ముందు టౌన్ హాలుకు వచ్చిన ప్రధాని మోడీతో ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ ఏదో వివరిస్తుండగా, అదే సమయంలో కెమెరాలకు అడ్డుగా ఉన్న ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్స్ బర్గ్‌ను ప్రధాని మోడీ తన కుడి చేతితో పక్కకు లాగాడు. దీంతో జూకర్స్ బర్గ్ అవాక్కయ్యాడు.

అనంతరం తేరుకొని చూడగానే కెమెరాకు అడ్డుగా ఉన్న నన్ను ప్రధాని మోడీ లాగారా అంటూ అదోలో ముఖం పెట్టాడు. ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సిందేమిటంటే ప్రధాని మోడీ ముందు కెమెరాలున్నప్పుడు ఎవరూ అడ్డుగా నిలబడకూడదు. మరో వైపు భారత్ పర్యటలో ప్రధాని మోడీ డ్రస్సుల మీద డ్రస్సులు మార్చాడంటూ ఆన్‌లైన్‌లో నెటిజన్లు మండిపడుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేట్ అయినప్పుడు కూడా ఆయన కంటే ప్రత్యేకంగా కనిపించారు. ముఖ్యంగా ఈ పర్యటనలో టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్ తదితర కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ముఖ్యంగా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్స్‌బర్గ్‌తో జరిగిన చిట్‌చాట్‌లో మోడీ ప్రత్యేకంగా కనిపించారు.












Click it and Unblock the Notifications