అందుకే కౌగిలించుకుంటారు: రాధేమా సూసైడ్ ఆలోచన
ముంబై: ఓ సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వివాదాస్పద రాధే మా చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు వింటున్నప్పుడు తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని బుధవారం నాడు ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమె ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు. తనకు 17 ఏళ్ల వయస్సులో వివాహం జరిగిందని చెప్పింది. రెండేళ్ల తర్వాత తన భర్త తనను వదిలేశాడని చెప్పింది. అతను విదేశాలకు వెళ్లాడని చెప్పింది.
తాను జీవనం కోసం బట్టలు కుట్టేదానిని అని చెప్పింది. తనకు సంగీతం అంటే ఇష్టమంది. తనను తన కుటుంబ సభ్యులు ఓ గురువు వద్దకు తీసుకు వెళ్లారని, అప్పుడు ఆ గురువు తనలో దైవశక్తులు ఉన్నాయని రాధే మా అని నామకరణం చేశారని చెప్పింది.

నాకు నేనుగా ఎప్పుడు దేవతను అని చెప్పుకోలేదన్నారు. కానీ ప్రజలు తనలో దేవతను చూశారన్నారు. ఓ ప్రశ్నకు సమాధానంగా... తాను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వ్యతిరేకం కాదని చెప్పింది. ప్రతి ఒక్కర్నీ నేను నా పిల్లల్లా చూస్తానని చెప్పింది. నన్ను ఓ తల్లిలా భావించి, నా అనుచరులు నన్ను కౌగిలించుకుంటారని చెప్పింది.
కట్నం వేధింపులు, లైంగిక హింసకు సంబంధించి రాధే మా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రశ్నించడానికి పోలీసులు రమ్మని చెప్పినప్పుడు తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పింది. కానీ తను నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షకు సిద్ధపడాలని భావించి ఊరుకున్నానని చెప్పింది.












Click it and Unblock the Notifications