నేను హిందూ ముస్లీంను: మెజిస్ట్రేట్‌కు సల్మాన్ ఖాన్ సమాధానం
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బుధవారం నాడు కోర్టు ఎదుట హాజరై.. తాను ఏ ఒక్క మతానికి చెందిన వాడిని కాదని, హిందువును, ముస్లీంను అని చెప్పారు. ఆయుధాలు కలిగి ఉన్న కేసులో విచారణ నిమిత్తం ఆయన బుధవారం కోర్టుకు వచ్చారు. సల్మాన్ ఖాన్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయవలసి ఉంది.
ఇందులో భాగంగా మెజిస్ట్రేట్ సల్మాన్ ఖాన్‌ను పలు ప్రశ్నలు అడిగారు. నీ మతం ఏమిటి అని అడిగారు. దానికి సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. తాను భారతీయుడిని అని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇక్కడ ఓ కాలమ్ ఉందని, దీనిని పూర్తి చేయాల్సి ఉందని, కాబట్టి చెప్పవలసి ఉంటుందని జడ్జి అడిగారు.

దీనికి స్పందించిన సల్మాన్ ఖాన్ తాను హిందువును, ముస్లీంను అని చెప్పారు. తన తండ్రి ముస్లీం అని, తన తల్లి హిందువు అని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల సమయంలో తన సోదరి అల్విరా, బాడీగార్డులతో కలసి సల్మాన్ ఖాన్ కోర్టుకు వచ్చారు. ఇ కేసులో తనను ఇరికించారని న్యాయమూర్తికి తెలిపారు. తాను లైసెన్సు కలిగిన ఆయుధాలను కలిగి ఉన్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications