కేరళ వరదలు-అల్లరిచేష్టలు: శ్రమించి వెళ్తే, హెలికాప్టర్‌ను దింపి సెల్ఫీ అడిగి వెళ్లమన్నాడు
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ, మత్స్యకారుల, ఆరెస్సెస్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా కొందరు వెళ్లి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కేరళ జలవిలయం దేశంతో పాటు విదేశాలను కూడా కదిలించింది.
ఇలాంటి సమయంలో కొందరు దీనిని మిస్ యూజ్ చేస్తున్నారు. ఇటీవల కొందరు యువకులు భారీ వరదల్లో ఉన్న మందు బాటిల్స్ కోసం నీటిలోకి దూకి వాటిని బయటకు తీసుకు వచ్చారు. అంతటి విషాధంలో ఆ సమయాన్ని సహాయం కోసం వెచ్చించే బదులు అలా చేయడం బాధాకరమని అంటున్నారు.

ఎన్డీఆర్ఎఫ్ సహాయం దుర్వినియోగం!
మరో వ్యక్తి అయితే సహాయక సిబ్బందితోనే ఆడుకున్నాడు. ఈ సంఘటన మరీ మరీ దారుణం. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నాయి. కానీ వారి సహాయాన్ని ఓ యువకుడు దుర్వినియోగం చేశాడు. దీనిపై సిబ్బందిలోని ఒకరు మీడియాకు వెల్లడించారు.
Recommended Video


ఎర్రరంగు చొక్కా తొలగించి
కేరళ వరదల్లో ఎంతోమంది చిక్కుకొని అల్లాడుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడటం లేదా వారికి ఆహారం, నీరు ఇవ్వడం చేస్తున్నారు. ఓ చోట తన ఎరుపు రంగు చొక్కాను తొలగించిన ఓ వ్యక్తి సహాయ చర్యల్లో పాల్గొంటున్న హెలికాప్టర్‌ను చూస్తూ ఊపాడు. దీంతో అందులోని సిబ్బంది సహాయం కోసం అతను అరుస్తున్నాడని భావించింది.

ఎంతో శ్రమించి దగ్గరకు వెళ్తే
అతనికి సహకరించేందుకు హెలికాప్టర్‌ను ఆ యువకుడి దగ్గరకు తీసుకు వెళ్లింది. ఎంతో శ్రమతో హెలికాప్టర్‌ను అతని సమీపానికి తీసుకు వెళ్లారు. కానీ ఆ సమయంలోనే ఆర్మీ ఊహించని విధంగా అతను షాకిచ్చాడు. హెలికాప్టర్ సహా వారు దగ్గరకు రాగానే సదరు యువకుడు తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసి, ఓ సెల్ఫీ తీసుకొని, ఆ తర్వాత వారిని ఇక వెళ్లండి అని చెప్పాడు. దీంతో అవాక్కవడం వారి వంతయింది.

బాధితులను రక్షించేందుకు పెళ్లి మండపానికి చేరుకోని వరుడు
ఓ వైపు తమ ప్రాణాలు పణంగా పెట్టి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, మత్స్యకారులు, ఆరెస్సెస్ సేవలు అందిస్తోంది. సామాన్యులు కూడా సహకరిస్తున్నారు. కేరళ చెంగనర్‌లోని బుధనూర్‌కు చెందిన 29 ఏళ్ల రంజిత్ అయితే ఏకంగా తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు. అతని పెళ్లి ఆగస్ట్ 17వ తేదీన ఉంది. ఏడాదిగా తాను ప్రేమిస్తున్న ఆర్యతో వివాహం జరగాల్సి ఉంది. కానీ అదే పెళ్లి రోజు అతను వరదలో చిక్కుకున్న వారిని ఎంతోమందిని కాపాడాడు. ఇటు రంజిత్, అటు ఆర్య ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లికి అంతా సిద్ధం చేశారు. కుటుంబ సభ్యులు అందరూ ఆగస్ట్ 15 నాటికే వచ్చారు. ఆగస్ట్ 16వ తేదీనే కుటుంబ సభ్యులను, బంధువులను పెళ్లి జరిగే చోటుకు పంపించారు. కానీ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు రంజిత్ మాత్రం పెళ్లికి మిస్సయ్యాడు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications