Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎపికి వస్తానని మాట తప్పిన 'బర్త్ డే బేబీ' జయప్రద!

లక్నో: ప్రముఖ నటి, రాష్ట్రీయ లోకదళ్ నాయకురాలు జయప్రద బిజ్నోర్ నుండి లోకసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బిజ్నోర్ నియోజకవర్గంలో ఆమె జోరుగా ప్రచారం చేస్తున్నారు.

2009లో ఆమె రాంపూర్ నియోజకవర్గం నుండి సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత తన రాజకీయ గురువు అమర్ సింగ్‌తో కలిసి ఎస్పీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ వైపు చూశారు. ఇటీవలె వాళ్లు ఆర్ఎల్డీలో చేరారు. జయప్రదకు ఆర్ఎల్డీ బిజ్నోర్ లోకసభ నియోజకవర్గాన్ని కేటాయించింది.

అయితే, బిజ్నోర్‌లో ఆమె వెంట నడిచేందుకు కార్యకర్తలు కూడా కరువయ్యారనే విమర్శలు వచ్చాయి. వాటిని ఆమె కొట్టి పారేశారు. ఈ నేపథ్యంలో బిజ్నోర్ నుండి పోటీ చేస్తున్న జయప్రద మరోసారి లోకసభలో అడుగు పెడతారా లేదా చూడాలి. కాగా, 2014 ఎన్నికల నాటికి ఎపి రాజకీయాల్లోకి వస్తానని గతంలో చెప్పిన జయప్రద మరోసారి యూపికే పరిమితమయ్యారు.

జయప్రద

జయప్రద

సినిమాల్లో హిట్టైన జయప్రద రాజకీయాల్లో మాత్రం అంత హిట్ కాలేకపోతుందనే చెప్పవచ్చు. అందం, అభినయం సమపాళ్ళలో కొలువైన రూపం జయప్రద పుట్టిన రోజు ఏప్రిల్ 3.

జయప్రద

జయప్రద

నటిగా తనదైన బాణీ పలికించిన జయప్రద ప్రస్తుతం రాజకీయ రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే, అంతగా హిట్ కాలేకపోతున్నారనే చెప్పవచ్చు.

జయప్రద

జయప్రద

తొలుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మెరిసిన జయప్రద.. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లారు. రాంపూర్ నుండి ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు బిజ్నోర్ నుండి పోటీకి సిద్దమయ్యారు.

జయప్రద

జయప్రద

2014 ఎన్నికల నాటికి సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తానని గత ఏడాది పలుమార్లు జయప్రద చెప్పారు. రాజమండ్రి నుండి పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపారు. ఈ ఎన్నికల నాటికి ఎపికి వస్తానని చెప్పిన జయప్రద మళ్లీ యూపి నుండి బరిలోకి దిగుతున్నారు.

జయప్రద

జయప్రద

కాగా, అంతర్జాతీయంగా భారతీయ సినిమాకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టిన సత్యజిత్ రే అంతటి వారే, భారతీయ మహిళకు అసలైన ప్రతిరూపం జయప్రద అని కితాబునిచ్చారు.

జయప్రద

జయప్రద

దీనిని బట్టే ఆమె అందంలోని మహత్తు ఏ పాటిదో ఇట్టే అర్థమవుతుంది. ఆరంభంలో అరకొర పాత్రల్లోనే అందంగా కనిపించిన జయప్రద.. కె బాలచందర్ తెరకెక్కించిన 'అంతులేని కథ'తో అభినయంలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఈ సినిమా జయప్రదను రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా మార్చింది.

జయప్రద

జయప్రద

అడవిరాముడుతో గ్లామర్ హీరోయిన్‌గా జయప్రద పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత జైత్రయాత్ర చేశారు. నాటి అగ్రహీరోలందరి సరసన జయప్రద నటించారు. ఉత్తరాదిన సైతం జయప్రద అలరించింది.

జయప్రద

జయప్రద

తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించిన జయప్రద రాజ్యసభకు ఎన్నికయ్యారు. తరువాత ఉత్తర భారతంలోని రాంపూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోకసభకు ఎంపికయ్యారు.

జయప్రద

జయప్రద

రాజకీయాల్లో కొనసాగుతూనే అడపాదడపా తన వద్దకు నడచి వచ్చిన అవకాశాలకు జయప్రద న్యాయం చేస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో జయప్రద బిజ్నోర్ నుండి లోకసభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+