వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏమైపోయారు? శశికళ తరలించిన ఎమ్మెల్యేలపై కుటుంబ సభ్యుల ఆందోళన

ఇది ఆయనొక్కడి బాధ మాత్రమే కాదు. మిగతా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది. క్షేమ సమాచారం తెలుసుకుందామన్నా.. సెల్ ఫోన్స్ అన్ని స్విచ్చాఫ్ చేసేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: నిన్నటిదాకా ఎడతెగని ఉత్కంఠతో సాగిన తమిళ పాలిటిక్స్ లో ఇప్పుడు కాస్త స్తబ్దత కనిపిస్తోంది. గవర్నర్ తో భేటీ తర్వాత పన్నీర్ ముఖంలో అధికార కళ ఉట్టిపడగా.. చిన్నమ్మ శశికళ మాత్రం ముభావంగానే అక్కడి నుంచి వెనుదిరిగినట్టు చెప్పుకుంటున్నారు. మీడియాతో మాట్లాడటానికి సైతం ఆమె ఆసక్తి చూపించలేదు.

జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నా.. చిన్నమ్మ శశికళ వెంట వెళ్లిన 130మంది ఎమ్మెల్యేలు ఏమైపోయారు అన్నదే ఇప్పుడు తమిళ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. ముఖ్యంగా ఆయా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు తమవాళ్లు ఎక్కడున్నారో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఇదే క్రమంలో ఓ మహిళా ఎమ్మెల్యే భర్త ఏకంగా పోలీసులను ఆశ్రయించి 'నా భార్య మిస్సింగ్' అంటూ ఫిర్యాదు చేశాడు.

Where that AIADMK missing MLAs, A woman MLA husband complaint to police

ఇది ఆయనొక్కడి బాధ మాత్రమే కాదు. మిగతా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది. క్షేమ సమాచారం తెలుసుకుందామన్నా.. సెల్ ఫోన్స్ అన్ని స్విచ్చాఫ్ చేసేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉపయోగం లేదు. మీడియా కథనాల్లో మాత్రం వారందరిని రిసార్టులో పెట్టి రాజభోగాలు అందిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో 40మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారని ఒకసారి.. లేదు 22మంది ఎమ్మెల్యేలు క్యాంపు నుంచి జారుకున్నారని మరోసారి వార్తలు వచ్చాయి. ఆపద్దర్మ సీఎం పన్నీర్ సైతం తనతో 22మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టు ప్రకటించారు. అయితే వీరంతా ఎక్కడున్నారన్న దానిపై మాత్రం ఎవరికీ స్పష్టత లేదు.

అయితే శశికళ వర్గమైన మన్నార్ గుడి మాఫియా నుంచి తప్పించుకోవడానికే వారంతా తమ ఆచూకీని గోప్యంగా ఉంచుతున్నారనేది మరో వాదన. మరోవైపు ఎమ్మెల్యేలను అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేలు సురక్షితంగానే ఉన్నారని ప్రభుత్వం తరుపు న్యాయవాది చెప్పడంతో కోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది.

ఎమ్మెల్యేలు రిసార్టులోనే ఉన్నారని శశికళ వర్గం చెబుతున్నా.. అక్కడా ఖాళీ గదులే దర్శనమిస్తున్నాయి తప్ప ఎమ్మెల్యేలు ఎవరూ లేరన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో.. అసలు ఎమ్మెల్యేలంతా ఏమైపోయారో తెలుసుకోవడానికి భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సోషల్ మీడియా వేదికగా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.

దాదాపు క్యాంపులోకి వెళ్లిన ప్రతీ ఎమ్మెల్యే ఫోన్ నంబర్ ను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆ నంబర్స్ అన్నీ స్విచ్చాఫ్ లేదా కాల్ డైవర్ట్ అని వస్తున్నాయని ఓ ఐటీ ఉద్యోగి పేర్కొన్నారు. దీంతో క్యాంపుకు వెళ్లిన ఎమ్మెల్యేల ఫోన్లన్ని శశికళ వర్గం చేతిలోనే ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

English summary
Its an interesting news that where AIADMK MLAs were gone after Sasikala send them into a remote place. A woman MLA Husband was complainted to police on his wife missing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X