మహిళలు ఎక్కువగా మద్యపానం సేవించే రాష్ట్రం ఏదో తెలుసా ..?

కాలం మారింది, కాలంతో పాటు మనం కూడా మారాలని తరుచూ వింటూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ఇది నిజమే అనిపిస్తోంది. గతంలో మన దేశంలో ఆల్కహాల్ తాగడాన్ని తప్పుగా భావించేవారు. కేవలం మగవారు మాత్రమే ఆల్కహాల్ సేవించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆల్కహాల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. నేటి జీవనశైలిలో పురుషులు, మహిళలు ఇద్దరూ బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు.తాగేవారికి తాగడానికి ఒక సాకు అవసరమని మీరు వినే ఉంటారు.

అది ఇంట్లో పార్టీ అయినా, స్నేహితులతో విహారయాత్ర అయినా లేదా ఆ రోజు అలసట, ఒత్తిడిని వదిలించుకోవడానికి మద్యం సేవిస్తూ ఉంటారు. నేడు పురుషులే కాదు మహిళలు కూడా ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. మహిళలు సైతం మగవారితో పోటీ పడుతూ మద్యం సేవిస్తున్నారు. గతంలో మగవారు ప్రత్యేకంగా మందు తాగడానికి పార్టీలు చేసుకునే వారు.ఇప్పుడు మహిళలు సైతం మగవారికి తీసిపోకుండా పార్టీలు చేసుకుంటున్నారు. పబ్‌ల్లో మగవారితో కలిసి కూర్చొని మద్యం సేవిస్తున్నారు.

which state in our country women drink more

మెట్రో సిటీల్లో మనకు ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే మహిళలు ఎక్కువగా మద్యపానం సేవించే రాష్ట్రాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే.. అస్సాంలో దాదాపు 26.3% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. మేఘాలయ రాష్ట్రంలోని స్త్రీలుల దాదాపు 8.7% మంది మద్యం సేవిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మహిళా మద్యపాన సేవకుల సంఖ్య 33.6% నమోదు అయింది. సిక్కిం రాష్ట్రంలో 0.3%కి మంది మహిళలు మద్యపానం సేవిస్తారని తేలింది. ఛత్తీస్‌గఢ్‌లో మహిళా మద్యపాన సేవకుల సంఖ్య 11.4% ఉండగా, NFHS-4లో ఈ సంఖ్య 0.2%కి తగ్గింది. జార్ఖండ్‌లో మహిళలు మద్యపానం చేసేవారి సంఖ్య 0.3%కి చేరింది.త్రిపుర రాష్ట్రంలో మహిళల మద్యపానం శాతం గతంలో 9.6% ఉండగా, ఇప్పుడు ఈ శాతం 0.8%కి తగ్గడం గమనార్హం.

ప్రస్తుతానికి అయితే అన్ని రాష్ట్రాల్లో, అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా మద్యం సేవించే పురుషులు (53%) మరియు మహిళలు (24%) ఉన్నారు. మహిళల్లో, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత సిక్కిం (16%); పురుషులలో, తెలంగాణ (43%) తరువాతి స్థానంలో ఉంది. మహిళలు మద్యం సేవించడం వల్ల నష్టాలతో పాటు, కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. మద్యపానం యొక్క ప్రభావాలు వ్యక్తిగత ఆరోగ్యం, జన్యుశాస్త్రం, జీవనశైలి మరియు మద్యపానం యొక్క పరిమాణం మరియు ఫ్రీక్వెన్సీ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని అధ్యయనాలు మితంగా మద్యం సేవించడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సూచిస్తున్నాయి. తద్వారా అందంగా ఉండటం కొందరు, ఆరోగ్యం కోసం మరికొందరు మద్యాన్ని సేవిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+