ఓయో రూమ్స్‌ని ఏ రాష్ట్రంలో అధికంగా వాడేస్తున్నారో తెలుసా,
ఓయో రూమ్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్ హోటళ్లు ,ఇతర అతిథి సేవలను అందిస్తుంది.ఓయోను 2013లో రితేష్ అగర్వాల్ స్థాపించారు. అప్పటి నుండి, ఇది భారతదేశంతో పాటు ఇతర దేశాలలో వేగంగా విస్తరించి, ప్రయాణికులకు వివిధ బడ్జెట్‌లకు అనుగుణంగా ఉండే అనేక రకాల సేవలను అందిస్తోంది.
అయితే మన దేశంలో ఓయో రూమ్స్ దుర్వినియోగం జరుగుతున్నాయని ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. గతంలో ప్రేమికులు పార్క్‌లను తమ అడ్డగా మార్చుకునేవారు. కానీ కాలక్రమేణ లవర్స్ ఏకాంతంగా గడపటానికి ఎక్కువగా ఓయో రూమ్స్‌ను తమకు బెస్ట్ ఛాయిస్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. ఓయో రూమ్స్ లవర్స్‌గా అడ్డగా మారిపోయిందనే చెప్పాలి. ఓయో రూమ్స్ పట్ల సమాజంలో ఏ రకమైన భావన ఉందో అందరికీ తెలిసిందే. నార్మల్ ఫ్యామిలీస్ ఓయో రూమ్ అంటేనే అసహ్యించుకునే రోజులు వచ్చాయి.

అసాంఘిక కార్యకలాపాలకు ఓయో రూమ్స్ అడ్డాగా మారాయి. ఈ హోటల్స్‌పై పోలీసులు స్పెషల్ నజర్ పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారంతో పాటు, ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాతే రూం ఇవ్వడం జరుగుతోంది. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఓయో రూమ్స్ బుకింగ్ కూడా రికార్డు స్థాయిలో జరిగినట్టు లెక్కలు బయటపడ్డాయి. న్యూ ఇయర్ వేడుకల్లో ఓయో రూమ్స్‌కు ప్రేమికులు క్యూ కట్టారు. యూత్ ఎక్కువగా ఓయో రూమ్స్ బుకింగ్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
10 లక్షల మందికి పైగానే ఓయో రూమ్స్ బుక్ చేసుకున్నట్టు ఓయో యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఓయో రూమ్స్‌పై విమర్శలు వినిపించాయి. అయితే తాజాగా ఓయో సంస్థ తాజాగా తమ రూల్స్‌ను మార్చింది. ఇక మీదట పెళ్లి అయిన వారికి మాత్రమే ఓయో రూమ్స్ ఇవ్వాలనే నిబంధనను తీసుకువచ్చింది. కేవలం వివాహం అయిన వారికి మాత్రమే ఇక మీదట రూమ్స్ ఇవ్వాలని నిర్ణయించింది.
మరోవైపు ఓయో రూమ్స్‌ను ఏ రాష్ట్రం వారు అధికంగా వినియోగిస్తున్నారని ఆరా తీయగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఓయో రూమ్స్ వినియోగం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.ముంబై, పూణే వంటి నగరాలు పర్యాటక ,వ్యాపార కేంద్రాలుగా ఉండటం వల్ల ఇక్కడ ఓయో రూమ్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది.ఢిల్లీ దేశ రాజధాని కావడం వల్ల ఇక్కడ కూడా ఓయో రూమ్స్ వినియోగం ఎక్కువగానే ఉంటుంది. బెంగుళూరు నగరంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్ల ఇక్కడ వ్యాపార ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు.
దీనితో ఓయో రూమ్స్ కు డిమాండ్ పెరుగుతుంది. హైదరాబాద్ నగరంలో కూడా ఓయో రూమ్స్ కు ఆదరణ ఉంది.ఇవి కాకుండా, గోవా, కేరళ వంటి పర్యాటక ప్రదేశాలలో కూడా ఓయో రూమ్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొత్తానికి, ఓయో రూమ్స్ వినియోగం దేశవ్యాప్తంగా పెరుగుతోంది. పర్యాటకం మరియు వ్యాపార ప్రయాణాలు పెరగడం వల్ల ఓయో రూమ్స్‌కు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
-
స్విగ్గీ, జొమాటో బంద్ ..! ఏపీలో హోటల్స్ సంచలన నిర్ణయాలు..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications