టైమ్స్ నౌ-వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ సర్వే: బీజేపీదే గెలుపు, కాంగ్రెస్‌కు ఈసారీ షాక్
Recommended Video

Gujarat Exit Polls : ఏ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
అహ్మదాబాద్: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ముగిశాయి. రెండు దశల్లో జరిగిన ఈ ఎన్నికలు 2019 ఎన్నికలకు ఎంతో కీలకంగా మారనున్నాయి. 182 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి.
టైమ్స్ నౌ -వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ సర్వేలో బీజేపీకి 109, కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని తేలింది.

బీజేపీ ఓట్లను చీల్చేందుకు ఎన్సీపీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీలో నిలిచాయి. మొత్తం 1828 మంది బరిలో నిలిచారు. నిరుద్యోగం, రైతుల కష్టాలు, పటీదార్ల ఉద్యమం, ఓబీసీ సమస్యలు తదితర అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని భావించారు.












Click it and Unblock the Notifications