నరేంద్ర మోడీ కేబినెట్లో సీనియర్లలో ఎవరికి ఏ పదవి?

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ఈ నెల 26వ తేదీన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోడీ దేశానికి 15వ ప్రధాని అవుతారు.

నరేంద్ర మోడీ తన కేబినెట్‌ను కుదించే అవకాశాలు ఉన్నాయి. ఆయన కేబినెట్లో 50 మంది వరకు ఉండే అవకాశముంది. అందులో 26 మందికి కేబినెట్ హోదా, మిగిలిన వారికి సహాయ పదవులు ఇవ్వనున్నారని సమాచారం.

పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ మోడీ తన కేబినెట్లో ఎన్డీయే పక్షాలను కూడా తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి ముఖ్య నేతలకు ఏ శాఖను ఇస్తారనే చర్చ సాగుతోంది.

రాజ్‌నాథ్ సింగ్

రాజ్‌నాథ్ సింగ్

బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్ విషయంలో మూడు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడం లేదా ముఖ్యమైన శాఖను తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. అధ్యక్షుడిగా కొనసాగేతే ప్రభుత్వానికి దూరంగానే ఉంటారు. మంత్రి పదవి ఆశిస్తే మాత్రం.. హోంశాఖ లేదా డిఫెన్స్‌ను ఇస్తారని సమాచారం. అయితే రాజ్‌నాథ్‌కు దాదాపు హోంశాఖ ఖరారైపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్‌నాథ్‌ గతంలో యూపి ముఖ్యమంత్రిగా పని చేశారు. అలాగే వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉప ప్రధానిగా ఉన్నారు.

ఎల్‌కె అద్వానీ

ఎల్‌కె అద్వానీ

బిజెపి అగ్రనేత అద్వానీకి లోకసభ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం సాగింది. అయితే దానికి ఆయన సుముఖంగా లేరట. మోడీ కంటే అద్వానీ చాలా సీనియర్ నాయకులు. దీంతో ఆయన మోడీ కింద పని చేసేందుకు సుముఖంగా లేకపోవచ్చునని, స్పీకర్ పదవినే తీసుకోవచ్చునని అంటున్నారు.

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

మోడీ హవాలోను గెలవని బిజెపి సీనియర్ మోస్ట్ నాయకులు అరుణ్ జైట్లీ ఒక్కరే. ఆయనను ఫైనాన్స్ మినిస్ట్రీ వరించే అవకాశముంది. ఎన్నికల్లో ఓడినందున జైట్లీ శాఖను తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేశారట. అయితే ఆయనను పార్టీ బుజ్జగించినట్లుగా తెలుస్తోంది.

మురళీ మనోహర్ జోషీ

మురళీ మనోహర్ జోషీ

బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ గతంలో మానవ వనరుల శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు ప్లానింగ్ కమిషన్ డిప్యూటై చైర్మన్ పదవి ఇచ్చే అవకాశముంది. అద్వానీ అంగీకరించకుంటే స్పీకర్ అయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

రవిశంకర ప్రసాద్

రవిశంకర ప్రసాద్

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు రవిశంకర ప్రసాద్‌కు నరేంద్ర మోడీ ప్రాధాన్యత కలిగిన న్యాయశాఖ అప్పగించనున్నారని సమాచారం.

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

బిజెపి సీనియర్ మహిళా నాయకురాలు సుష్మా స్వరాజ్ రానున్న ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. యూపిఏ హయాంలో ఆమె లోకసభలో ప్రతిపక్ష సభ్యురాలిగా తనదైన ముద్ర వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+