Bird Flu: ఇండియాలో రెండో బర్డ్ ప్లూ కేసు నమోదు..
భారతదేశంలో రెండో బర్డ్ ఫ్లూ కేసు నమోదు అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 4 ఏళ్ల చిన్నారికి ఈ ఏడాది జనవరిలో బర్డ్ ప్లూ లక్షణాలను గుర్తించారు. దీంతో బాలుడిని చికిత్స కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో రెండుసార్లు చేరాల్సి వచ్చింది. బాలుడు మేలో డిశ్చార్జ్ అయ్యాడు."కేసు జనవరిలో గుర్తించారు. అప్పటి నుంచి ఎవరికీ వ్యాధి సోకలేదు" అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. బర్డ్ ఫ్లూ మనిషి నుంచి మనిషికి వ్యాపించడం ప్రారంభించినప్పుడు మాత్రమే ఆందోళన ఉంటుందన్నారు.
జ్వరం, కడుపునొప్పి రావడంతో పిల్లవాడిని మొదట శిశువైద్యుని వద్దకు తీసుకెళ్లారు. పిల్లవాడు తరువాత మూర్ఛలతో బాధపడ్డాడు. శ్వాసకోశ బాధ, అధిక జ్వరం, పొత్తికడుపు తిమ్మిరి కారణంగా స్థానిక ఆసుపత్రిలోని ICUలో చేరాడు. చికిత్స తర్వాత ఫిబ్రవరి డిశ్చార్జ్ అయ్యాడు. తీవ్రమైన శ్వాసకోశ బాధతో చిన్నారిని మార్చి 3న మళ్లీ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బాలుడి నుంచి నమూనాను సేకరించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. బాలుడికి వైరస్ H9N2 ఉన్నట్లు తేలింది.

చివరకు మే 1న ఆక్సిజన్ సపోర్టుతో రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. పౌల్ట్రీలో వ్యాపించే ఇన్ఫెక్షన్‌తో భారతదేశంలో మానవులలో బర్డ్ ఫ్లూ అప్పుడప్పుడు కేసులను చూడవచ్చని WHO పేర్కొంది. H9N2తో మానవులకు సోకిన వ్యాధి స్వల్పంగా ఉంటుంది. H9N2 కారణంగా ప్రపంచవ్యాప్తంగా రెండు మరణాలు నమోదయ్యాయి. ఏవియన్ ఫ్లూ సంక్రమణను నివారించడానికి.. ప్రజలు జంతువులు, పౌల్ట్రీ, వాటి మలంతో కలుషితమైన ప్రాంతాలతో సంబంధాన్ని తగ్గించుకోవాలి.
పౌల్ట్రీల్లో పనిచేసేవారు వారు వీలైనంత తరచుగా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా జంతువులను ముట్టుకున్న తర్వాత పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు దూరంగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications