బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ లైఫ్, సీఈవో మాస్టర్ మైండ్ ! ఎం స్కెచ్ వేశాడంటే ?
బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు సకలసదుపాయాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఎవరు ? అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు సకలసదుపాయాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఎవరు ? అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. శశికళకు అన్ని సౌకర్యాలు కల్పించిన వ్యక్తి ఎవరో తెలిసిపోయింది.
శశికళ సోదరుడు జయరామ్, ఇళవరసి కుమారుడు వివేక్ ఈ తతంగం మొత్తం నడిపించాడని మంగళవారం తమిళ మీడియా వార్తలు ప్రసారం చేసింది. జాజ్ సినిమాస్ సీఈవో అయిన వివేక్ అంటే శశికళకు చాల ప్రేమ. శశికళ అంటే వివేక్ కు చాల ఇష్టం.

వివేక్ చిన్నప్పుడు పోయెస్ గార్డెన్ లోనే పెరిగాడు. శశికళ బినామీ ఆస్తులకు వివేక్ వారసుడు అని తమిళనాడులో చాలకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. తన మేనత్త శశికళ జైల్లో ఎలాంటి కష్టాలు పడకూడదని భావించిన వివేక్ బెంగళూరులోనే మకాం వేసి అక్కడి అధికారులతో సంప్రదించాడు.
జైల్లో శశికళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే మీకు ఏమీ కావాలన్నా ఇస్తానని వివేక్ అధికారులను బుట్టలో వేసుకున్నాడని సమాచారం. ఇలా అధికారులను అనేక రకాలుగా మభ్యపెట్టిన వివేక్ చివరికి తన మేనత్త శశికళకు అన్ని సౌకర్యాలు కల్పించాడని తెలిసింది. అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు వివేక్ తల్లి ఇళవరసి కూడా పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నది.












Click it and Unblock the Notifications