Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం పదవికి రాజీనామా! బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?

బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. సుదీర్ఘ కాలం పాటు బీహార్ సీఎంగా తన సేవలందించిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (75) గురువారం తన రాజీనామాను ప్రకటించారు. ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలనే తన చిరకాల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. "బీహార్ అభివృద్ధి కోసం నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి నా మార్గదర్శకత్వం అందిస్తాను" అని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

1. సామ్రాట్ చౌదరి
ప్రస్తుతం బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి రేసులో అందరికంటే ముందున్నారు.బీజేపీలో కీలక నేతగా ఎదిగిన ఆయనకు పాలనపై మంచి పట్టుంది. గతంలో పంచాయతీ రాజ్ మంత్రిగా, ప్రస్తుతం హోం శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు పార్టీ అధిష్ఠానం వద్ద కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

Who is Bihar Next CM Nitish Kumar Resigns Samrat Choudhary and Nityanand Rai in Race

2. నిత్యానంద్ రాయ్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న నిత్యానంద్ రాయ్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన నేత కావడం గమనార్హం. హాజీపూర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఉజియార్‌పూర్ నుంచి ఎంపీగా గెలిచిన రికార్డు ఆయనకుంది. జాతీయ స్థాయిలో అమిత్ షాకు సన్నిహితుడిగా పేరున్న నిత్యానంద్ రాయ్.. రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

3. నిశాంత్ కుమార్
అందరినీ ఆశ్చర్యపరుస్తూ నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. నిశాంత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని జేడీయూ శ్రేణులు, యువత నుంచి భారీగా ఒత్తిడి వస్తోంది. ఆయనకు 'డిప్యూటీ సీఎం' పదవి ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ సూచనప్రాయంగా తెలిపారు.

బీహార్‌లో కొత్త సమీకరణాలు
నితీష్ కుమార్ తప్పుకోవడంతో బీహార్‌లో బీజేపీ ప్రాబల్యం మరింత పెరగనుంది. 2020 ఫార్ములా ప్రకారం విజయ్ సిన్హా, సామ్రాట్ చౌదరిలలో ఒకరు సీఎం.. మరొకరు డిప్యూటీ సీఎంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే నిశాంత్ కుమార్ ఎంట్రీ ఇస్తే జేడీయూ-బీజేపీ కూటమిలో కొత్త ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. హోలీ పండుగ వేళ బీహార్ ప్రజలకు ఈ కొత్త ప్రభుత్వం రూపంలో పెద్ద వార్త అందబోతోంది. మరి బీహార్ బాధ్యతలను భుజాన వేసుకునే ఆ అదృష్టవంతుడు ఎవరో కొద్ది గంటల్లో తేలిపోనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+