ఐసిసి ఉగ్రవాది కర్ణాటకవాసి: సైనికుల దాడిలో మృతి ?

బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాది కర్ణాటకకు చెందిన సుల్తాన్ అబ్దుల్ ఖాదిర్ ఆర్మర్ భద్రతాదళాల దాడిలో మరణించాడని వెలుగు చూసింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్ కు చెందిన సుల్లాన్ అబ్దుల్లా ఖాదిర్ ఈనెల 6వ తేదిన సిరియా- టర్కి సరిహద్దులలో జీహాది పోరాటం చేస్తున్న సమయంలో సైనికులు కాల్చి చంపారని వెలుగు చూసింది. భారత్ కు చెందిన ఉగ్రవాద సంస్థ సుల్తాన్ మరణించాడని వారి వైబ్ సైట్ లో పెట్టారని అధికారులు గుర్తించారు.

బత్కల్ లోని నవాజ్ కాలనీ, హాజి మంజిల్ లో 1975 డిసెంబర్ 12వ తేదిన సుల్తాన్ అబ్దుల్లా జన్మించాడు. ఇతను అనేక పేర్లతో ట్విట్టర్ అకౌంట్లు ప్రారంభించి భారత్ నుండి ముస్లీం యువకులను ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షించడానికి ప్రయత్నించాడు. ఇతని ట్విట్టర్ అకౌంట్లలో Twitter @ Sult, @ Mulla, @Moulana, @Nakhwa, @ Pandit, @ Shekhu, @ Sheikh-Ul-Hadees and @ Pujari ఉన్నాయి.

సుల్తాన్ అబ్దుల్ ఖాదిర్ ఆర్మార్ లక్నోలోని నద్వాత్ ఉల్ ఉలేమాల్ లో విద్యాభ్యాసం చేశాడు. తరువాత అతని సోదరుడు షఫి ఆర్మర్ తో కలిసి ఇండియన్ ముజాహుద్దిన్, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ లకు చెందిన ఉగ్రవాద సంస్థలలో పని చేశాడని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఇప్పటికే దృవీకరించాయి.

 Who is Karnataka's Abdul Khadir Sultan Armar alias Sultan?

రిక్రూట్ చేసే పనిఛ బలి అయిన రెండవ బత్కల్ ఉగ్రవాది!

ఇండియన్ ముజాహుద్దిన్ ఉగ్రవాద సంస్థ నాయకుడు రియాజ్ బత్కల్, యాసిన్ బత్కల్, సుల్తాన్ అబ్దుల్ ఖాదిర్ ఆర్మర్ ఒకే ప్రాంతానికి చెందిన వారు. వీరు నిత్యం టచ్ లో ఉండేవారు. యాసిన్ బత్కల్, రియాజ్ బత్కల్ చెప్పిన ఆదేశాలను సుల్తాన్ ఎప్పటికప్పుడు పాటించేవాడు. ఇండియన్ ముజాహుద్దిన్ లో చేరిన తరువాత ఇతను ముస్లీం యువకులను ఆకర్షించి ఉగ్రవాదం వైపు నడిపించేవాడు.

ఐఎస్ఐఎస్ విడుదల చేసిన అనేక వీడియో క్లిప్పింగ్ లలో సుల్తాన్ ముసుగులు వేసుకుని ఉన్నాడని ఇంటిలిజెన్సీ వర్గాలు అంటున్నాయి. భారత్, పాకిస్థాన్ లోని ముస్లీం యువకులను ఐఎస్ఐఎస్ లో చేరాలని ఇతను పదే పదే ట్విట్ చేస్తు మనవి చేసేవాడని అధికారులు అంటున్నారు.

సైనికుల చేతిలో ఇప్పటి వరకు ఐఎస్ఐఎస్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు (కర్ణాటక కు చెందిన వారు) అంతం అయ్యారు. 2014లో బత్కల్ కు చెందిన అన్వర్ హుస్సేన్ అఫ్ఘనిస్థాన్ లోని కందాహార్ దగ్గర భద్రతా దళాల కాల్పులలో మరణించాడు. కొన్ని నెలల క్రితం ముంబాయి నుండి ఇరాక్ వెళ్లి ఐఎస్ఐఎస్ లో చేరిన సుల్తాన్ సైనికుల చేతిలో అంతం అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+