ఎవరీ రూపా గంగూలీ?: భర్త ఇన్ సెక్యూర్, కో-సింగర్‌తో...

కోల్‌కతా: ప్రముఖ నటి, గాయని రూపా గంగూలీ బుధవారం నాడు భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. హౌరాలోని శరత్ సదన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో కమలతీర్థం పుచ్చుకున్నారు.

రూపా గంగూలీ 1966 నవంబర్ 25వ తేదీన కోల్‌కతా సమీపంలోని కల్యాణీ నగర్లో జన్మించారు. 1992లో ద్రుబ ముఖర్జీతో వివాహం జరిగింది. వారి వివాహం బంధం 2006 వరకు కొనసాగింది.

1988 నుండి వచ్చిన టీవీ మహాభారతంలో ద్రౌపతి పాత్రతో ఆమె ప్రఖ్యాతి గాంచారు. హిందీ, బెంగాలీ చిత్రాల్లో ఆమె నటించారు. పలు హిందీ, బెంగాళీ చిత్రాలకు ఆమె బెస్ట్ ఫిమేల్ బ్యాక్ సింగర్ నేషనల్ ఫిల్మ అవార్డులు గెలుచుకున్నారు.

 రూపా గంగూలీ

రూపా గంగూలీ

1993వ ఏట వచ్చిన పద్మ నాదిర్ మాఝీ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చింది. అలాగే 1995లో వచ్చిన యుగంత్, 2006లో వచ్చిన అంతర్మల్ చిత్రాలు కూడా.

 రూపా గంగూలీ

రూపా గంగూలీ

ఉమ్మడి కుటుంబంలో రూపా గంగూలీ పెరిగారు. జోగమయ దేవీ కళాశాల నుండి డిగ్రీ చేశారు. 1992లో ధ్రుబో ముఖర్జీని పెళ్లి చేసుకున్నారు.

 రూపా గంగూలీ

రూపా గంగూలీ

అయితే, 2006లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటిగా తనకు పేరు రావడాన్ని తన భర్త ఇన్ సెక్యూర్‌గా ఫీలవుతున్నారని పేర్కొంది. ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. అతను 1997లో జన్మించాడు.

 రూపా గంగూలీ

రూపా గంగూలీ

భర్తతో బంధం తెగిపోయాక ఆమె తన కంటే 13 ఏళ్లు చిన్నవాడైన కో-సింగర్ దిబ్యేందుతో కలిసి ముంబైలో జీవించారు. పలు టెలివిజన్ చానళ్లలో ఆమె నటించారు.

 రూపా గంగూలీ

రూపా గంగూలీ

రూపా గంగూలీ 1985లో అనిల్ కపూర్ నటించిన సాహెబ్ చిత్రంలో నటించారు. ఆమె సెకండ్ రోల్ మలయాళంలో చేసింది. మమ్ముట్టి పక్కన నటించారు.

 రూపా గంగూలీ

రూపా గంగూలీ

గౌతమ్ ఘోష్ 'పద్మ నాదిర్ మాజ్ హీ', అపర్ణా సేన్ 'యుగాంత్', రితుపర్ణ ఘోష్ 'అంతర్ మహలా' సినిమాలు ఆమె మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 రూపా గంగూలీ

రూపా గంగూలీ

'అబొషెషే' బెంగాలీ సినిమాకు ఆమె ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు. రూపా గంగూలీ బుధవారం బీజేపీలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+