శ్రీని వెడ్స్ మహి పేరుతో శశికళ ఫ్యామిలీకి ఝలక్, ఆ జంట ఎవరు, ఒకటే చర్చ, పక్కా ప్లాన్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లు, నివాసాల్లో ఆదాయపన్ను శాఖ దాడులు జరుతున్న సందర్బంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు అదే తమిళనాడులో ఇద్దరి పేర్లు ఎవరివి అంటూ అంతే స్థాయిలో చర్చ మొదలైయ్యింది.

శశికళ ఫ్యామిలీకి రెండో రోజూ ఐటీ షాక్, బెంగళూరులో పాత కారులో రూ. కోట్ల ఆస్తుల పత్రాలు !

ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం రాత్రి కొన్ని ట్రావెల్స్ కంపెనీలకు ఫోన్ చేసి పెళ్లికి వెళ్లడానికి ట్యాక్సీలు కావాలని చెప్పారు. ట్యాక్సీలు వచ్చిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న శ్రీని వెడ్స్ మహి అనే స్టిక్కర్లను డ్రైవర్ల దగ్గరకు ఇచ్చి కారు ముందు ఉన్న అద్దానికి అతికించాలని చెప్పారు.

Who is that Srini Mahi Tamil Nadu people are eager know about them

120 ప్రాంతాలకు బయలుదేరిన అన్ని వాహనాలకు శ్రీని వెడ్స్ మహి అనే పేర్లు ఉన్న స్టిక్కర్లు అతికించిన అధికారులు ఏదో వీవీఐపీ పెళ్లికి వెలుతున్నట్లు హడావిడి చేశారు. చివరికి అన్ని వాహనాలు శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, వారి న్యాయవాదుల ఇళ్ల దగ్గరకు వెళ్లాయి.

ఐటీ అధికారులకు షాక్: దినకరన్ ఫాంహౌస్ లో సీక్రెట్ గదులు, లాక్ నెంబర్లు గుర్తులేవు, సీజ్ !

బెంగళూరులో సోదాలు చేసే సమయంలో శ్రీని వెడ్స్ మహి అనే స్టిక్కర్లనే కార్లకు అతికించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రభుత్వ చిహ్నాలు, రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్న వాహనాలు పక్కన పెట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా వ్యవహరించారు. ఇప్పుడు ఆదాయపన్ను శాఖ అధికారులు తెర మీదకు తెచ్చిన శ్రీని వెడ్స్ మహి ఎవరూ అంటూ తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శ్రీని వెడ్స్ మహి అనే పేర్లు శశికళ ఫ్యామిలీ రైడ్స్ కోసం ఐటీ శాఖ అధికారుల పెట్టిన కోడ్ అని తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
People of TN wants to know about who are Srini and Mahi, on whom the IT officials pasted the stickers in the cars used in the raids against Sasikala family.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి