రూ.500 కోట్లకు పైగా దక్కించుకోబోతున్న రతన్ టాటా వీలునామాలో మిస్టరీ మ్యాన్ ఎవరు?
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. గొప్ప మానవతామూర్తిగా, సమాజ సేవకుడిగా పేరొందిన రతన్ టాటా మృతితో యావత్ దేశం కంటతడి పెట్టింది. తన వేల కోట్ల ఆస్తిని సోదరుడు జిమ్మీ టాటాకు వీలునామా రాశారు. అలానే తన వద్ద పని చేస్తున్న వారికి, పెంపుడు శునకాలకు కూడా ఆస్తిలో వాటా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ వీలునామాలో ఉన్న ఓ వ్యక్తి గురించే దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
తన ఆస్తిలో రూ.500 కోట్లకు పైగా ఆస్తులను ఆయనకు చెందేలా రతన్ టాటా వీలునామాలో పేర్కొన్నట్టు సమాచారం. టాటా కుటుంబ సభ్యులు కూడా ఆ వీలునామా చూసి షాక్ అయ్యారని తెలుస్తోంది. ఇంతకీ ఆ రహస్య వ్యక్తి ఎవరు ? ఆయనకు, రతన్ తాటాకు ఉన్న సంబంధం ఏంటి ? ఆయనకు ఎన్ని కోట్ల ఆస్తులు దక్కబోతున్నాయో మీకోసం ప్రత్యేకంగా.....

రతన్ టాటా వీలునామాలో ప్రస్తావించిన ఆ వ్యక్తి జంషెడ్‌పూర్‌కు చెందిన ట్రావెల్ సెక్టార్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తాగా చెబుతున్నారు. మోహన్ దత్తా, అతని కుటుంబం ట్రావెల్ ఏజెన్సీ స్టాలియన్‌ను కలిగి ఉన్నారు. దీనిని 2013లో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో విలీనం చేశారు. మోహిని దత్తా కుటుంబం స్టాలియన్‌లో 80 శాతం వాటాను కలిగి ఉంటే.. 20 శాతం వాటా టాటా ఇండస్ట్రీస్ యాజమాన్యం కలిగి ఉంది. ఆయన థామస్ కుక్ మాజీ అనుబంధ సంస్థ అయిన TC ట్రావెల్ సర్వీసెస్‌కు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన టాటా వద్ద ఆరు దశాబ్దాలకు పైగా నమ్మకంగా పని చేశారు.
అంతే కాకుండా టాటా కుటుంబానికి దత్తా చాలా సన్నిహితంగా ఉండేవారని అంటున్నారు. రతన్ టాటా మరణించినప్పుడు ఆయనతో తనకున్న సాన్నిహిత్యం గురించి దత్తా మాట్లాడుతూ... టాటా తనకు 24 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. తాను జీవితంలో ఎదగడానికి టాటా ఎంతో సాయం చేశారని తెలిపారు. దీంతోనే మోహిని మోహన్ దత్తాకు తన ఆస్తిలో రూ.500 కోట్లు ఇవ్వాలని రతన్‌టాటా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
ఇక రతన్ టాటా సంపదలో ఎక్కువ భాగం దాతృత్వానికి కేటాయించారు. ఆయన జీవించి ఉన్నంత కాలం దాతృత్వ కార్యకలాపాలు కొనసాగించారు. ఈ కార్యక్రమాల కోసం రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ అనే రెండు సంస్థలను కూడా స్థాపించారు.
ఈ క్రమంలోనే రతన్ టాటా వీలునామా ప్రకారం ఆస్తుల్లో వాటా పొందిన కొందరు కుటుంబ సభ్యులు, ఆ డబ్బును విరాళంగా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. రతన్ టాటాకు టాటా సన్స్ షేర్లతో పాటు, రతన్ టాటాకు ఫెరారీ, మసెరటి వంటి లగ్జరీ కార్లు, ఖరీదైన పెయింటింగ్‌లు, స్టార్టప్‌లలో వాటాలు, ఇతర పెట్టుబడులు కూడా ఉన్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications