అదానీ షెల్ కంపెనీల్లో పెట్టిన రూ. 20వేల కోట్ల పెట్టుబడులు ఎవరివి?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంలోని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి వెళుతున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే రాహుల్ గాంధీ.. భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రులు, ఇతర పార్టీ శ్రేణులతో సోమవారం సూరత్ కోర్టుకు వెళ్లారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని ఓ మీడియా ప్రతినిధి ఆయనను ప్రశ్నించారు.
అయితే, బీజేపీ నేతలు చెప్పిన మాటలే ఎందుకు అడుగుతున్నారని రాహుల్ కౌంటర్‌గా ప్రశ్నించారు. మీరు బీజేపీ చెప్పిందే ఎందుకు ప్రతీసారీ చెబుతారన్నారు. అదానీకి చెందిన షెల్ కంపెనీల్లో రూ. 20వేల కోట్లు ఎవరివి? ఆయన ఎవరి బినామీ? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై నరేంద్ర మోడీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

ఈ క్రమంలో దేశంలోని వెనుకబడిన వర్గాలను, మీడియాను అవమానించడం రాహుల్ గాంధీ మనస్తత్వమని బీజేపీ నేతలు మండిపడ్డారు. రాహుల్ ది అహంకార రాజవంశం అని అభివర్ణించారు. 'ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభంపై రాహుల్ గాంధీ మళ్లీ దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తరచూ దాడి చేసే ధైర్యంతో అతను తన నానమ్మ అడుగుజాడల్లో నడుస్తున్నాడు' అని రాహుల్ గాంధీపై బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ ట్వీట్ చేశారు.
सवाल वही कायम है- अडानी की शेल कंपनियों में '20 हजार करोड़' किसके हैं? pic.twitter.com/O4VVjCj3vE
— Congress (@INCIndia) April 4, 2023
రాహుల్‌ది దురహంకార వంశం అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. ఇటీవల మీడియా సమావేశంలో రాహుల్ గాంధీని.. ఓబీసీలను, "మోడీ ఇంటిపేరు"తో అవమానించారని బీజేపీ ఆరోపణ గురించి అడిగిన తర్వాత.. ఆయన ఒక జర్నలిస్ట్‌ను చులకన చేయడం వివాదాస్పదమైంది. ఇప్పటికే రెండుసార్లు కాన్ఫరెన్స్‌లో తనకు ఈ ప్రశ్న అడిగారని.. రిపోర్టర్ బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించడంతోపాటు జర్నలిస్టులా నటించవద్దని ఎద్దేవా చేశారు రాహుల్.












Click it and Unblock the Notifications